ఆస్కార్‌ అవార్డుల ప్రెడిక్షన్ జాబితాలో ఎన్టీఆర్‌ (NTR).. యంగ్ టైగర్‌కు విందు ఇవ్వ‌నున్న‌ కేంద్ర హోం మంత్రి !

Updated on Aug 21, 2022 05:22 PM IST
ఎన్టీఆర్ (NTR) ఆస్కార్ అవార్డుల ప్రెడిక్షన్ లిస్టులో చోటు దక్కించుకోగా... ఇప్పుడు అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ మ‌రో సంచ‌ల‌నంగా మారింది.
ఎన్టీఆర్ (NTR) ఆస్కార్ అవార్డుల ప్రెడిక్షన్ లిస్టులో చోటు దక్కించుకోగా... ఇప్పుడు అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ మ‌రో సంచ‌ల‌నంగా మారింది.

RRR: 'ఆర్ఆర్ఆర్' సినిమాతో టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (NTR) మ‌రింత పాపుల‌ర్ అయ్యారు. కొమురం భీముడుగా ఎన్టీఆర్ న‌ట‌న అద్భుతం అంటూ సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు ప్ర‌శంసిస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలుగు హీరో ఎన్టీఆర్‌ను క‌ల‌వ‌నున్నారు. ప్రతీ సంవత్సరం ఆస్కార్ అవార్డులను ప్రెడిక్ట్ చేసే 'వెరైటీ' అనే సంస్థ, ఇటీవలే రిలీజ్ చేసిన ఉత్తమ నటుల జాబితాలో ఎన్టీఆర్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. ఇదే ఓ సంచ‌ల‌నం అయితే... ఇప్పుడు అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ మ‌రో సంచ‌ల‌నంగా మారింది.

ఆస్కార్‌కు నామినేట్ అయిన ఎన్టీఆర్

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన 'రౌద్రం ర‌ణం రుధిరం' (RRR) సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ సినిమా వేల కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టింది. హాలీవుడ్ రేంజ్‌‌‌లో అవార్డులను సొంతం చేసుకుంది. ఇక కొమురం భీముడిని పోలిన పాత్రలో ఎన్టీఆర్ ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.  

అమిత్ షాను క‌ల‌వ‌నున్న ఎన్టీఆర్

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌నకు వ‌స్తున్న అమిత్ షా హీరో ఎన్టీఆర్‌ (NTR) ను క‌ల‌వ‌నున్నారు. ప్రముఖ హోటల్‌‌లో జరిగే విందుకు ఎన్టీఆర్‌ను కూడా ఆహ్వానించారు. అమిత్ షా ఇటీవలే 'ఆర్ఆర్ఆర్' చిత్రం చూశారట‌. ఆ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న‌, అమిత్ షాకు ఎంత‌గానో న‌చ్చింద‌ట‌.

కొమురం భీముడిని పోలిన పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా న‌టించారంటూ అమిత్ షా ప్ర‌శంసించార‌ట. ఎన్టీఆర్ న‌ట‌న‌కు ఫిదా అయిన అమిత్.. త‌న హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో యంగ్ టైగ‌ర్‌ను స్వయంగా కలిసి అభినందించ‌నున్నార‌ట‌. 

Read More: RRR: 'భీమా నిన్ను క‌న్న నేల త‌ల్లి గ‌ర్వ‌ప‌డుతుంది'... ఇజ్రాయెల్ ప‌త్రిక‌ల్లో ఎన్టీఆర్( NTR) క‌థ‌నాలు

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!