Macherla Niyojakavargam: 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' ట్విట్ట‌ర్ రివ్యూ - నితిన్ (Nithiin), వెన్నెల కిషోర్ న‌ట‌న‌ అదుర్స్

Updated on Aug 12, 2022 02:00 PM IST
'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమాలో నితిన్ (Nithiin) క‌లెక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించారు. మాస్ డైలాగులతో అద‌ర‌గొట్టారు.
'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమాలో నితిన్ (Nithiin) క‌లెక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించారు. మాస్ డైలాగులతో అద‌ర‌గొట్టారు.

Macherla Niyojakavargam: టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) న‌టించిన‌ మాస్ యాక్ష‌న్ సినిమా 'మాచర్ల నియోజకవర్గం' ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి న‌టించారు. ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మొద‌టి సినిమా 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం'. కొత్త ద‌ర్శ‌కుడైనా కూడా ఈ సినిమాను అద్భుతంగా చిత్రీక‌రించారంటూ, ప్రేక్ష‌కులు డైరెక్టర్ టేకింగ్‌ను ప్ర‌శంసిస్తున్నారు. అయితే, రొటీన్ క‌థ‌నే కొత్త‌గా చూపించారంటున్నారు. 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమాపై ట్విట్ట‌ర్ రివ్యూలు ఎలా ఉన్నాయంటే..

డైరెక్ష‌న్ బాగుంది - ప్రేక్ష‌కులు

'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమాలో నితిన్ (Nithiin) క‌లెక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించారు. మాస్ డైలాగులతో అద‌ర‌గొట్టారు. మొద‌టి పార్టు కామెడీ బాగుందంటూ ప్రేక్ష‌కులు ట్వీట్ చేస్తున్నారు. రొటీన్ క‌థ అయినా కూడా.. ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి వెండితెర‌పై కొత్త‌గా వినోదం పంచారంటున్నారు. ఎన్నో చిత్రాల‌కు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేసిన రాజ‌శేఖ‌ర్ రెడ్డి 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం'తో ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ అయ్యారంటున్నారు. సెకండ్ ఆఫ్‌లో 'రా.. రా.. రెడ్డి' పాట దుమ్ము లేపిందంటూ కామెంట్లు పెడుతున్నారు. 

'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం' సినిమాలో నితిన్ (Nithiin) క‌లెక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించారు. మాస్ డైలాగులతో అద‌ర‌గొట్టారు.

వెన్నెల కిషోర్ సినిమాకు ప్ల‌స్!

విల‌న్ రాజ‌ప్ప పాత్ర‌లో త‌మిళ న‌టుడు స‌ముద్ర ఖ‌ని న‌టించి మెప్పించారు. స‌ముద్ర ఖ‌ని విల‌న్ పాత్ర‌ల‌కు స‌రిగ్గా స‌రిపోతున్నార‌ని.. పాత్ర‌కు త‌గ్గ న‌ట‌న క‌న‌బ‌రుస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే హీరోయిన్ కృతి శెట్టి గ్లామ‌ర్ డోస్ పెంచింద‌ని.. నితిన్‌ (Nithiin)తో వేసిన స్టెప్పులు బాగున్నాయని అంటున్నారు. 

ఇక హీరోయిన్ అంజ‌లి కూడా 'రా..రా.. రెడ్డి' పాట‌తో థియేట‌ర్ల‌ను షేక్ చేస్తుందంటూ నెటిజ‌న్లు తెలిపారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ అందించిన‌ సంగీతం ఇప్ప‌టికే సోషల్ మీడియాలో మోత మోగిస్తోంది.ఇక వెన్నెల కిషోర్ కామెడీ గనుక  లేకపోతే, సినిమా  మరో లెవల్‌లో ఉండేది కాదని ప్రేక్ష‌కులు అభిప్రాయపడుతున్నారు.

వెన్నెల కిషోర్‌ నటనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయనే సినిమాకు ప్ల‌స్ అంటున్నారు. ఆదిత్య మూవీస్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం'  చిత్రాన్ని నిర్మించారు. 

Read More : Macherla Niyojakavargam Trailer: 'మాచర్ల నియోజకవర్గం' ట్రైలర్ రిలీజ్.. డైలాగులతో అదరగొట్టిన నితిన్ (Nithiin)

 

 

 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!