The Ghost: ది ఘోస్ట్ - కిల్లింగ్ మిష‌న్ వ‌చ్చేస్తుంది!.. క‌త్తి ప‌ట్టిన‌ నాగ‌ర్జున (Nagarjuna)

Updated on Jul 07, 2022 01:45 PM IST
నాగార్జున (Nagarjuna) న‌టిస్తున్న 'ది ఘోస్ట్' చిత్రం యాక్ష‌న్, థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతుంది.
నాగార్జున (Nagarjuna) న‌టిస్తున్న 'ది ఘోస్ట్' చిత్రం యాక్ష‌న్, థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతుంది.

The Ghost : టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) కొత్త మూవీ ది ఘోస్ట్ సినిమా లేటెస్ట్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ది ఘోస్ట్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఎప్ప‌టినుంచో నాగార్జున సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఈ అప్‌డేట్ ఫుల్ జోష్‌ను అందించింది. గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. 

ఆవేశంగా నాగ్
ది ఘోస్ట్ చిత్రంలో నాగార్జున ఆవేశంగా క‌నిపించారు. క‌త్తితో ఎవ‌రిపైనో దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఘోస్ట్ ఎవ‌రు?. కిల్లింగ్ మిష‌న్ క‌థ ఏంటి?. నాగార్జున ఎలాంటి యాక్ష‌న్ సీన్స్ చేశారో చూడాలంటే... సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. 

ది ఘోస్ట్‌లో నాగార్జున ఇంట‌ర్ పోల్ ఆఫీస‌ర్‌గా వినోదం అందించ‌నున్నారు. నాగార్జున‌కు జంట‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు. సోనాల్ చౌహాన్ లేడీ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.  శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

టీజ‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?
నాగార్జున
(Nagarjuna) న‌టిస్తున్న 'ది ఘోస్ట్' చిత్రం యాక్ష‌న్, థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ జూలై 9 న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది. ది ఘోస్ట్ సినిమాకు కిల్లింగ్ మిషిన్ అనే హ్యాష్ ట్యాగ్ జ‌త చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. 

ది ఘోస్ట్ సినిమాను విదేశాల్లో కూడా చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఆగ‌స్టు చివ‌రి వారంలో విడుద‌ల చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. మొద‌ట థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల‌తో ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఓటీటీలో ది ఘోస్ట్ రిలీజ్ కానుంది. 

ది ఘోస్ట్ ప్ర‌క‌ట‌న‌
బంగార్రాజు సినిమాతో నాగార్జున (Nagarjuna) సూప‌ర్ హిట్ అందుకున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్‌గా ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు చిత్రాన్ని తెర‌కెక్కించారు. నాగార్జున త‌న కుమారుడు నాగ చైతన్యతో క‌లిసి న‌టించిన బంగార్రాజు సంక్రాంతి బ‌రిలో దూసుకెళ్లింది. విలేజ్ ఫాంట‌సీ చిత్రంగా స‌క్సెస్ సాధించింది. బంగార్రాజు సెట్స్ పై ఉండగానే దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ది ఘోస్ట్ చిత్రాన్ని ప్రకటించారు నాగార్జున‌. 

Read More: బ్ర‌హ్మాస్త్రం (Brahmastra ) : బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలో.. కింగ్ నాగార్జున (Nagarjuna) ప‌వ‌ర్ ఫుల్ లుక్ రిలీజ్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!