'లైగర్' థియేటర్లలో నాగార్జున (Nagarjuna) 'ది ఘోస్ట్' సినిమా ట్రైలర్ హంగామా..నాగ్ ఈజ్ బ్యాక్ అంటున్న అభిమానులు!

Updated on Aug 25, 2022 05:11 PM IST
నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ది ఘోస్ట్‌ సినిమా ట్రైలర్‌‌ను సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు రిలీజ్ చేయనున్నారు
నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ది ఘోస్ట్‌ సినిమా ట్రైలర్‌‌ను సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు రిలీజ్ చేయనున్నారు

నాగార్జున (Nagarjuna) హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న మూవీ "ది ఘోస్ట్". ఈ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగ్ ఇంటర్ పోల్ ఆఫీసర్‌  పాత్ర పోషిస్తున్నారు .  ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించగా.. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించారు.

రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే 'ది ఘోస్ట్' సినిమాకు సంబంధించి, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా, ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నారు. అయితే అంతకంటే ముందుగానే, ఈ సినిమా ట్రైలర్ వీక్షించే అవకాశం ప్రేక్షకులకు దక్కింది.

'లైగర్' సినిమా విడుదలైన థియేటర్లలోనే "ది ఘోస్ట్" ట్రైలర్ కూడా ప్రదర్శితమైంది. 1:55 నిమిషాల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్.. ఇంటర్వెల్ స్లైడ్ తర్వాత  ప్లే అవుతుంది. దీనికి ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో ఉంది.

నాగార్జునను ప్రవీణ్ సత్తారు ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రలో చూపిస్తున్నారట. ఈ సంగతి 'ది ఘోస్ట్' ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

చాలా గ్యాప్ తర్వాత నాగ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. 'చావును చాలాసార్లు చాలా దగ్గరగా చూశాను' 'ఒక్కడిని కూడా వదలను' లాంటి డైలాగ్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి. భయంకరమైన గ్యాంగ్ స్టర్స్ - కిడ్నాపర్స్ - మర్డరర్స్.. ఇలా మొత్తం అండర్ వరల్డ్‌తో ఫైట్ చేసే పాత్రలో నాగార్జున కనిపించారు.

తుపాకీలతో రౌడీలను వేటాడటం.. కత్తులతో శత్రు మూకను ఊచకోత కోయడం వంటి సీన్స్ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచాయి. ట్రైలర్ చివర్లో నాగ్ ఒక చైర్‌లో ఠీవిగా కూర్చోవడం.. పెద్ద కత్తితో విలన్ మీదకు దూకడం వంటి షాట్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రవీణ్ సత్తారు మరోసారి తన వర్క్‌తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఈ విషయం 'ది ఘోస్ట్' ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. ప్రతీ ఫ్రేమ్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది. దుబాయ్ - ఊటీ వంటి అందమైన ప్రదేశాల్లో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ బాగున్నాయి.
 

నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ది ఘోస్ట్‌ సినిమా ట్రైలర్‌‌ను సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు రిలీజ్ చేయనున్నారు

నాగ్‌కూ బ్రేక్‌ ఇస్తారా..

'LBW (-లైఫ్ బిఫోర్ వెడ్డింగ్)' సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు.. 'చందమామ కథలు' చిత్రంతో జాతీయ అవార్డ్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో 'గుంటూరు టాకీస్' 'PSV గరుడవేగ' వంటి బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకొని.. కింగ్ అక్కినేని నాగార్జునతో వర్క్ చేసే అవకాశం అందుకున్నారు ప్రవీణ్.

నాగార్జున (Nagarjuna) వంటి సీనియర్ హీరోని హ్యాండిల్ చేసిన విధానం.. అక్కినేని ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఉండేలా ఈ పవర్ ప్యాక్డ్ చిత్రాన్ని రెడీ చేసినట్లు తెలుస్తుంది. థియేటర్‌లో 'ది ఘోస్ట్' ట్రైలర్ చూసిన తర్వాత, అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. 'వింటేజ్ నాగ్ ఈజ్ బ్యాక్' అంటున్నారు. అలాగే దర్శకుడి పనితనం మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

కమల్ హాసన్‌కు 'విక్రమ్' ఎలాంటి విజయాన్ని అందించిందో.. నాగ్‌కు ఈ సినిమా కూడా అలాంటి సక్సెస్ ఇస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. 'ది ఘోస్ట్' మూవీ తర్వాత ప్రవీణ్ సత్తారు.. టాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లిస్టులో చేరిపోతారని కామెంట్ చేస్తున్నారు.

'ది ఘోస్ట్' ట్రైలర్ ఆ సినిమాపై కచ్చితంగా అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పాలి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా నాగార్జున (Nagarjuna) ‘ది ఘోస్ట్‌’ సినిమా విడుదల కాబోతోంది.

Read More : Liger Movie Review: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ‘లైగర్’ సినిమా మాస్‌ ప్రేక్షకులకు మాత్రమే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!