NTR30: 'ఎన్టీఆర్ 30 'షూటింగ్ షురూ!.. హీరోయిన్ కోసం వెతుకుతున్న ద‌ర్శ‌కుడు

Updated on Jul 27, 2022 06:02 PM IST
ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమా ప్ర‌క‌టించి చాలా రోజులు అవుతున్నా.. ఇంకా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు.
ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమా ప్ర‌క‌టించి చాలా రోజులు అవుతున్నా.. ఇంకా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు.

NTR30: టాలీవుడ్ హీరో ఎన్టీఆర్‌ (NTR) కు ఆర్.ఆర్.ఆర్. బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చింది. అంతేకాకుండా ఆ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీముడిని పోలిన పాత్రలో న‌టించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప‌లు కొత్త ప్రాజెక్టుల్లో బిజీ కానున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయ‌నున్నారు. ఎన్టీఆర్ న‌టించే 30వ సినిమా ఇది. 'ఎన్టీఆర్ 30' సినిమా లేటెస్ట్  అప్‌డేట్స్ గురించి తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'ఆచార్య' సినిమాతో కొర‌టాల శివ భారీ ఫ్లాప్ అందుకున్నాడు. ఆచార్య త‌ర్వాత వెంట‌నే 'ఎన్టీఆర్ 30' సినిమాను ఆయన ప్రకటించారు. ఈ సినిమాతో కొర‌టాల శివ త‌న స‌త్తా ఏంటో చూపించ‌నున్నారు. ఎన్టీఆర్‌తో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టేందుకు ఆయన తాపత్రయపడుతున్నారు.

ఎన్టీఆర్ 30పై భారీ అంచ‌నాలు

ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమాను ప్ర‌క‌టించి చాలా రోజులు అవుతున్నా.. ఇంకా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం త్వరలోనే 'ఎన్టీఆర్ 30' సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే సెప్టెంబ‌ర్ రెండో వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఇక ఆరు నెల‌ల్లోనే షూటింగ్ పూర్తి చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుందట. ముఖ్యంగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుందని టాక్. 'ఎన్టీఆర్ 30' చిత్రానికి జూబ్లీహిల్స్‌లో ఓ సెట్ వేయడానికి ప్రయత్నిస్తున్నారట.

ఎన్టీఆర్ 30 (NTR 30) లో హీరోయిన్‌గా ఆలియా భ‌ట్ న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే ఆలియా భ‌ట్ ప్రెగ్నెంట్ కావున..  మ‌రో హీరోయిన్‌ను వెతికే ప‌నిలో ప‌డ్డారు కొర‌టాల శివ‌. సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా 'ఎన్టీఆర్ 30'  సినిమాను నిర్మిస్తున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న ఎన్టీఆర్ 30పై భారీ అంచనాలే ఏర్ప‌డ్డాయి. 

Read More: NTR30: ఎన్టీఆర్ ప‌వ‌ర్ ఫుల్ రోల్ చేస్తున్నారు - కొర‌టాల శివ! ఎన్టీఆర్ 30 సినిమాపై ఎక్స్‌క్లూజీవ్ అప్‌డేట్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!