ప‌వ‌ర్ స్టార్ పుట్టిన రోజున మెగాస్టార్ (Chiranjeevi) సినిమా అప్‌డేట్స్ రిలీజ్..'మెగా 154'పై బాబి స్పెష‌ల్ ట్వీట్

Updated on Sep 03, 2022 12:24 PM IST
చిరంజీవి (Chiranjeevi), ర‌వితేజ‌ల మ‌ధ్య జ‌రిగే సీన్ల‌ను చిత్రీక‌రిస్తే 'మెగా 154' షూటింగ్ పూర్త‌యిన‌ట్టే అంటూ ద‌ర్శ‌కుడు బాబి ట్వీట్ చేశారు. 
చిరంజీవి (Chiranjeevi), ర‌వితేజ‌ల మ‌ధ్య జ‌రిగే సీన్ల‌ను చిత్రీక‌రిస్తే 'మెగా 154' షూటింగ్ పూర్త‌యిన‌ట్టే అంటూ ద‌ర్శ‌కుడు బాబి ట్వీట్ చేశారు. 

టాలీవుడ్ మెగాస్టార్  చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న 'మెగా 154' నుంచి మెగా అప్‌డేట్ రిలీజ్ అయింది. ఈ సినిమా గురించిన లేటెస్ట్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో తెలిపారు. 'మెగా 154' ఫైన‌ల్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుందంటూ ప్ర‌క‌టించారు. చిరంజీవి, ర‌వితేజ‌ల షూటింగ్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుందంటూ ద‌ర్శ‌కుడు బాబి ట్వీట్ చేశారు. చిరంజీవి పుట్టిన రోజున బాబి త‌న సినిమా అప్‌డేట్‌ను ప్ర‌క‌టిస్తార‌ని అభిమానులు భావించారు. కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజున చిరు సినిమా విశేషాల‌ను బాబి షేర్ చేసుకోవ‌డం విశేషం. 

'మెగా 154' షూటింగ్ షెడ్యూల్

చిరంజీవి 'ఆచార్య' డిజాస్ట‌ర్ త‌రువాత సినిమాల‌పై ఫోక‌స్ మరింత పెంచారు. బాబి ద‌ర్శ‌క‌త్వంలో చిరు 'మెగా 154' చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు 'వాల్తేరు వీర‌య్య' అనే టైటిల్ ఖ‌రారు చేస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ర‌వితేజ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు.

చిరంజీవి (Chiranjeevi) , ర‌వితేజ‌ల‌కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంద‌ట‌. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు బాబి త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగే సీన్ల‌ను చిత్రీక‌రిస్తే 'మెగా 154' షూటింగ్ పూర్త‌యిన‌ట్టే అంటూ ట్వీట్ చేశారు. 

కొత్త పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ చిరంజీవి

'మెగా 154' సినిమాలో చిరంజీవి ఓ మత్స్యకారుడి పాత్ర‌లో న‌టించ‌నున్నార‌ట‌.ద‌ర్శ‌కుడు బాబి స‌రికొత్త క‌థ‌తో 'వాల్తేరు వీర‌య్య' సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. చిరంజీవి, ర‌వితేజ అన్న‌ద‌మ్ములుగా ఈ సినిమాలో న‌టిస్తున్నార‌ట‌. ఇద్దరూ సవతి తల్లి పిల్లలుగా క‌నిపిస్తార‌ని..  సినిమాలో వీరి మధ్య కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, ఆవేశపూరితమైన సంభాషణలు కూడా ఉంటాయ‌నే వార్త‌లు అంతర్జాలంలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

'మెగా 154' సినిమాలో చిరంజీవికి (Chiranjeevi)  జోడిగా శృతి హాసన్ న‌టిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ రోల్ కోసం ద‌ర్శ‌కుడు ఓ పవర్ ఫుల్ యాక్టర్‌ని సెల‌క్ట్ చేశార‌ట. లేడీ విలన్‌ క్యారెక్టర్లకు పెట్టింది పేరైన త‌మిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ప్రతినాయకురాలి పాత్రను పోషిస్తున్నారని టాక్.

'మెగా 154' సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటర్‌గా నిరంజన్‌ దేవరమానె వ‌ర్క్ చేస్తున్నారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌గా ఎఎస్‌ ప్రకాష్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 2023 సంక్రాంతి కానుక‌గా మెగా154 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More: HBD Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి జీవితంలోని టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలివే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!