మాస్‌ సినిమాకే చిరంజీవి (Chiranjeevi) ఫస్ట్ ప్రయారిటీ.. ‘వాల్తేరు వీరయ్య’ పూర్తయ్యాకే తరువాత సినిమాలకు డేట్స్

Updated on Jun 05, 2022 11:12 PM IST
చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్‌‌ బాబి
చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్‌‌ బాబి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  రీసెంట్‌గా ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించినంతగా అభిమానులకు చేరువ కాలేదు. దాంతో ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో తర్వాత తను చేయబోయే సినిమాల విషయంలో చిరంజీవి ఆలోచనలో పడ్డారని ఇండస్ట్రీ టాక్. ఎలాంటి సినిమాతో ప్రేక్షకులను పలకరించాలి. ఏ డైరెక్టర్‌‌తో సినిమా చేయాలి అనే విషయంలో స్పష్టమైన అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది.

ప్రస్తుతం రెండు మూడు సినిమాలను ఓకే చేశాడు చిరంజీవి. ఆ సినిమా షూటింగ్‌లను త్వరగా పట్టాలెక్కించి త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు మొన్నటివరకు. అయితే ఆచార్య ఫలితం ఆయన ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్’, మెహెర్ రమేష్‌ డైరెక్షన్‌లో ‘భోళాశంకర్’, బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల్లో నటిస్తున్నాడు చిరు. ఒక్కో సినిమాకి డేట్స్ ఇస్తూ బిజీబిజీ షెడ్యూల్స్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు చిరంజీవి.

వాల్లేరు వీరయ్య పోస్టర్

రీమేక్స్‌ కథలు గనుకే..

అయితే తాజాగా చిరంజీవి మరో నిర్ణయానికి కూడా వచ్చారని ఇండస్ట్రీ టాక్‌. పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమాను పూర్తి చేసి ఆ తరువాత మిగిలిన సినిమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడట చిరు. గతంలో చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి తరహాలో ఫుల్‌ లెంగ్త్‌ మాస్ క్యారెక్టర్‌‌ చేస్తున్నాడట వాల్తేరు వీరయ్య సినిమాలో. అంతేకాకుండా వాల్తేరు వీరయ్య సినిమా పక్కా తెలుగు కథ. ఇక, గాడ్‌ఫాదర్, భోళాశంకర్‌‌ రీమేక్ సినిమాలు. ఆ సినిమాలు ఇప్పటికే హిట్‌ టాక్ సొంతం చేసుకున్నాయి. ఆయా సినిమాల కథలపై ప్రేక్షకులకు అవగాహన ఉంటుంది కూడా. దాంతో రీమేక్ సినిమాలు ఎంత మంచి టాక్‌ను సొంతం చేసుకున్నా.. స్ట్రెయిట్‌ సినిమా హిట్‌ ఇచ్చిన కిక్ ఉండదని అనుకుంటున్నాడట చిరంజీవి. అందుకే ముందుగా వాల్తేరు వీరయ్య సినిమాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడట మెగాస్టార్.   

ఇక, లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా వస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యింది దాదాపుగా చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. ఆగస్టులో గాడ్‌ఫాదర్‌‌ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని కూడా సమాచారం. మరి దీని కన్నా ముందుగానే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను విడుదల చేస్తారా లేక గాడ్‌ఫాదర్‌‌తో ప్రేక్షకులను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పలకరిస్తాడా అనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య సినిమాలోని పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్‌ మలేషియా వెళ్లనుంది.

Read More: చిరు 154 వ సినిమా టైటిల్ ఖరారు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!