Chiranjeevi's GodFather Trailer : అద్భుతః.. చిరు స్టామినాని మరోసారి రుచి చూపించిన గాడ్ ఫాదర్ ట్రైలర్ !

Updated on Sep 29, 2022 12:07 AM IST
మెగా ఫ్యాన్స్ ఎన్నో కళ్ళతో ఎదురుచూస్తున్న "గాడ్ ఫాదర్" (God Father) ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది.
మెగా ఫ్యాన్స్ ఎన్నో కళ్ళతో ఎదురుచూస్తున్న "గాడ్ ఫాదర్" (God Father) ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది.

మెగా అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న "గాడ్ ఫాదర్" (God Father) సినిమా ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ రోజు జరిగిన సినిమా ప్రిరిలీజ్ వేడుకలో నిర్మాతలు ఈ చిత్ర ట్రైలర్‌ని అధికారికంగా విడుదల చేశారు. 2 నిమిషాల 12 సెకన్ల వ్యవధి గల ఈ ట్రైలర్‌లో చిరంజీవి (Chiranjeevi) తన డైలాగ్స్‌తో దుమ్మురేపారు. అక్టోబర్ 5వ తేదిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

స్లోగన్స్‌తో హోరెత్తిన వేదిక

సెప్టెంబర్ 28వ తేదిన అనగా నేడు అనంతపురం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో "గాడ్ ఫాదర్" (God Father) సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ''నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నా.. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు'' అంటూ చెప్పిన డైలాగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. "జై మెగాస్టార్.. జైజై మెగాస్టార్" అనే స్లోగన్స్‌తో వేదికను హుషారెత్తించారు.  

”మన స్టేట్ సిఎం పికెఆర్ ఆకస్మిక మరణం. మంచోళ్ళంతా మంచోళ్ళు కాదు. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనుక. అన్ని రంగులు మారుతాయి. నెక్స్ట్ సిఎం సీట్లో కూర్చోవడానికి ఆల్ పాజిబులిటీస్ వున్న వ్యక్తి.. ” అంటూ ఓ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ వాయిస్ ఓవర్‌ను దర్శకుడు పూరీ జగన్నాథ్ అందించారు. 

చిత్రం పై భారీ అంచనాలు

మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో రూపొందిన "గాడ్ ఫాదర్" సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార ముఖ్య పాత్రలో నటించగా.. సత్యదేవ్, సముద్రఖని మొదలైనవారు కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు మోహన్ రాజాకి ఇది తెలుగులో రెండవ సినిమా. గతంలో ఆయన 'హనుమాన్ జంక్షన్' చిత్రానికి దర్శకత్వం వహించారు. 

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) "గాడ్ ఫాదర్" చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది. 

Read More: 'గాడ్‌ఫాద‌ర్' సినిమాకు లైన్ క్లియ‌ర్.. చిరు (Chiranjeevi) లుక్‌తో స‌ర్‌ప్రైజ్ అయిన ఫ్యాన్స్

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!