Mega Brother Naga Babu Birthday Special : నిర్మాతగా, హీరోగా, బుల్లితెర సెలబ్రిటీగా నాగబాబు ప్రస్థానమిదే ..!

Updated on Oct 29, 2022 03:03 PM IST
నాగబాబు (Naga Babu) తన అన్నయ్య చిరంజీవి నటించిన "రాక్షసుడు" సినిమాలో స్పెషల్ పాత్రలో మొదటిసారి వెండితెరపై కనిపించారు. 
నాగబాబు (Naga Babu) తన అన్నయ్య చిరంజీవి నటించిన "రాక్షసుడు" సినిమాలో స్పెషల్ పాత్రలో మొదటిసారి వెండితెరపై కనిపించారు. 

నాగబాబు (Naga Babu).. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సుపరిచితులు. తొలినాళ్ళలో తన అన్నతో కలిసి పలు చిత్రాలలో నటించిన నాగబాబు, ఆ తర్వాత హీరోగా కూడా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నిర్మాతగానూ రాణించారు. ప్రస్తుతం బుల్లితెర సెలబ్రిటీగా కూడా తన పంథాలో దూసుకుపోతున్నారు. నాగబాబు జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం మీకోసం.. !

టాలీవుడ్‌లో నటుడిగా, నిర్మాతగా నాగబాబు తన కెరీర్ ప్రారంభించారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నాగబాబు నిర్మించిన మొదటి చిత్రం "రుద్రవీణ". ఈ సినిమాగా గాను ఆయన ఉత్తమ నిర్మాతగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా "రుద్రవీణ" నర్గీస్ దత్ స్మారక పురస్కారాన్ని కైవసం చేసుకోవడం విశేషం. 

నాగబాబు (Naga Babu)

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించడమే కాకుండా.. టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ, నాగబాబు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. "అన్నయ్య" మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి సినిమాల్లో సపోర్టుగా నిలిచిన నాగబాబు ఆయన పెట్టిన రాజకీయ పార్టీకి కూడా మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం తన తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన పొలిటికల్ పార్టీకి కూడా నైతిక మద్దతును అందిస్తున్నారు. 

నాగబాబు (Naga Babu)

మొగల్తూరు బిడ్డ
నాగబాబు అసలు పేరు కొణిదల నాగేంద్రబాబు. 1961 అక్టోబర్ 29 తేదీన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో నాగబాబు జన్మించారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన నాగబాబు చిరంజీవి సలహా మేరకు సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలపై అవగాహన పెంచుకున్నారు. 

తన అన్నయ్య చిరంజీవి నటించిన "రాక్షసుడు" సినిమాలో స్పెషల్ పాత్రలో నాగబాబు మొదటిసారి వెండితెరపై కనిపించారు. చిరంజీవి హీరోగా నటించిన మరణ మృదంగం, త్రినేత్రుడు, లంకేశ్వరుడు, కొండవీటి దొంగ, మృగరాజు, హ్యాండ్సప్, బావగారూ బాగున్నారా, అంజి చిత్రాల్లో స్పెషల్ పాత్రల్లో నాగబాబు నటించారు.

 

నాగబాబు (Naga Babu)

నిర్మాతగా ప్రస్థానం
నాగబాబు తన తల్లి గారైన అంజనాదేవి పేరు మీద "అంజనా ప్రొడక్షన్స్"  అనే నిర్మాణ సంస్థను స్థాపించారు.ఆ బ్యానర్ పై చిరంజీవి హీరోగా మొత్తం ఐదు సినిమాలను నిర్మించారు.  చిరంజీవితో తొలిసారిగా ‘రుద్ర వీణ’ సినిమాను తమ సొంత నిర్మాణ సంస్థ "అంజనా ప్రొడక్షన్స్" బ్యానర్ పైనే నిర్మించారు. 

కె.బాలచందర్ దర్శకత్వంలో రుద్రవీణ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా అనుకున్నంత రాబట్టలేకపోయినా.. నిర్మాతగా నాగబాబు జాతీయ అవార్డును అందుకున్నారు.

నాగబాబు (Naga Babu)

రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మెనగాళ్లు, బావగారు బాగున్నారా, స్టాలిన్ .. ఇవన్నీ "అంజనా ప్రొడక్షన్స్" బ్యానర్ మీద రిలీజ్ అయిన చిత్రాలే. అలాగే తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో ‘గుడుంబా శంకర్’ సినిమాను నాగబాబు నిర్మించారు. ఇక చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్‌తో "ఆరెంజ్" సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా తీరని నష్టాలను మిగిల్చింది. 

అంతకుముందే, తమ సొంత బ్యానరులో తానే హీరోగా "కౌరవుడు" అనే సినిమాను తెరకెక్కించారు నాగబాబు. ఆపద మొక్కుల వాడు, అగ్రిమెంట్, సూపర్ ఎక్స్ ప్రెస్, 420 మొదలైన సినిమాల్లో హీరోగా నటించారు.
 
ప్రస్తుతం నాగబాబు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా కనిపిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. జబర్దస్త్ వంటి కామెడీ షోలకు న్యాయ నిర్ణేతగానూ వ్యవహరించారు. అలాగే ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. ఓవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో నాగబాబు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.

Read More : పూనకాలు లోడింగ్.. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)గా రఫ్ఫాడిస్తున్న మెగాస్టార్ చిరు (Chiranjeevi Konidela)

తన అన్నయ్య చిరంజీవి నటించిన

 
 
నాగబాబు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని పింక్ విల్లా కోరుకుంటుంది.  హ్యాపీ బర్త్ డే నాగబాబు.
పింక్ విల్లా.
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!