The South Swag: 'ఇండియా టుడే మ్యాగజైన్' పై అల్లు అర్జున్ (Allu Arjun) ఫోటో !

Updated on Jul 17, 2022 10:12 PM IST
ఇండియాలోనే అత్యంత పాపులర్ మ్యాగజైన్ 'ఇండియా టుడే' కొత్త ఎడిషన్ పై అల్లు అర్జున్  (Allu Arjun) ఫోటో
ఇండియాలోనే అత్యంత పాపులర్ మ్యాగజైన్ 'ఇండియా టుడే' కొత్త ఎడిషన్ పై అల్లు అర్జున్ (Allu Arjun) ఫోటో

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' సినిమా త‌ర్వాత పాపుల‌ర్ స్టార్‌గా మారారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రిలీజ్ అయిన 'పుష్ప' అల్లు అర్డున్‌కు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చింది. అల్లు అర్జున్ 'పుష్పరాజ్' పాత్రలో కనబరిచిన న‌ట‌న‌కు సౌత్‌తో పాటు నార్త్ లోనూ మంచి గుర్తింపు వ‌చ్చింది. అల్లు అర్జున్ ఫోటోను 'ఇండియా టుడే మ్యాగజైన్‌'పై ప్ర‌చురించడంతో బ‌న్నీ అభిమానులు కేరింత‌లు కొడుతున్నారు. 

త‌గ్గేదేలే అంటున్న అల్లు అర్జున్
పాన్ ఇండియా స్టార్ల లిస్టులో అల్లు అర్జున్ (Allu Arjun) కూడా చేరారు. ఇండియాలోనే అత్యంత పాపులర్ మ్యాగజైన్‌లో అల్లు అర్జున్ ఫోటోను ప్ర‌చురించారు. 'ఇండియా టుడే మ్యాగజైన్' కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫోటో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఆయన న‌ట‌న గురించి ప్ర‌త్యేక ఆర్టిక‌ల్ రాశారు. ఈ మ్యాగజైన్ ముఖచిత్రంపై   'తగ్గేదేలే ' అన్న‌ట్లు అల్లు అర్జున్ పెట్టిన ఫోజు అదిరిపోతోంది. మ్యాగజైన్‌ పై త‌న ఫోటో ప్ర‌చురించడంపై అల్లు అర్జున్ ఆనందం వ్య‌క్తం చేశారు.

 

ఇండియాలోనే అత్యంత పాపులర్ మ్యాగజైన్ 'ఇండియా టుడే' కొత్త ఎడిషన్ పై అల్లు అర్జున్  (Allu Arjun) ఫోటో

బ‌న్నీకి పెరిగిన డిమాండ్
అల్లు అర్జున్ (Allu Arjun) ఫోటోతో త‌మ కొత్త ఎడిష‌న్‌కు మంచి డిమాండ్ ఉంటుందని ఇండియా టుడే భావిస్తోంది. ఇదే క్రమంలో 'ది సౌత్ స్వాగ్' అంటూ సౌత్ సినిమాలపై స్పెషల్ ఆర్టికల్‌ను కూడా ఈ పత్రిక ప్రచురించింది. ఇక 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ తన న‌ట‌న‌తో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. పుష్పరాజ్ మ్యాన‌రిజం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.  

ఆగస్టు నుంచి రెగ్యులర్ షూట్

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన 'పుష్ప 2' షూటింగ్‌ ఫిబ్రవరి నుంచే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే 'పుష్ప' సినిమాకు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, సెకండ్ పార్ట్‌ను మరింత జాగ్రత్తగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. దానికి తగినట్టుగా స్క్రిప్ట్‌లో కొద్దిగా మార్పుచేర్పులు చేస్తున్నారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించడానికి ప్లాన్‌ చేస్తోంది చిత్ర యూనిట్. 

‘పుష్ప’ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో 'పుష్ప2'  సినిమాకు రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేశాడట బన్నీ. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్‌. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క‌థ‌నాల ప్రకారం.. ‘పుష్ప 2’ సినిమాకు అల్లు అర్జున్ (Allu Arjun) ఏకంగా రూ.90 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారని టాక్. 

Read More: Pushpa : రికార్డుల్లో త‌గ్గేదేలే అంటున్న పుష్ప ! తెలుగు హీరోగా చ‌రిత్ర సృష్టించిన‌ అల్లు అర్జున్ (Allu Arjun)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!