పుష్ప2 సినిమాకు అల్లు అర్జున్ (Allu Arjun) ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటే? వైరల్ అవుతున్న న్యూస్

Updated on Jul 11, 2022 10:14 PM IST
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun)
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిర పాన్ ఇండియా సినిమా `పుష్ప– ది రైజ్‌`. ర‌ష్మికా మందాన హీరోయిన్‌గా న‌టించారు. సునీల్‌, ఫహాద్‌ ఫాజిల్, అన‌సూయ‌, అజయ్ ఘోష్, రావు ర‌మేష్ కీలకపాత్రల్లో  న‌టించారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌పై తెరకెక్కిన ఈ సినిమా పోయనేడాది డిసెంబ‌ర్ 17వ తేదీన విడుద‌లై బ్లాక్ బ‌స్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.350 కోట్లు క‌లెక్ట్‌ చేసి రికార్డులను బద్దలుకొట్టింది. పుష్ప సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ బాలీవుడ్‌లో రూ.100 కోట్లు కలెక్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌ `పుష్ప – ది రూల్‌` తెరకెక్కుతోంది.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun)

ఆగస్టు నుంచి రెగ్యులర్ షూట్

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా పుష్ప2 షూటింగ్‌ ఫిబ్రవరి నుంచే స్టార్ట్ కావాల్సి ఉంది. అయితే పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని సెకండ్ పార్ట్‌ను మరింత జాగ్రత్తగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. దానికి తగినట్టుగా స్క్రిప్ట్‌లో కొద్దిగా మార్పుచేర్పులు చేస్తున్నారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్‌ చేస్తోంది చిత్ర యూనిట్. 

‘పుష్ప’ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో పుష్ప2 సినిమాకు రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేశాడట బన్నీ. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్‌. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క‌థ‌నాల ప్రకారం.. ‘పుష్ప 2’ సినిమాకు అల్లు అర్జున్ (Allu Arjun) ఏకంగా రూ.90 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారని టాక్. మరి వైరల్ అవుతున్న ఈ న్యూస్‌లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Read More : సినీ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ (Mani Sharma) బర్త్‌డే స్పెషల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!