Allu Arjun: తెల్ల దుస్తుల్లో ఏంజెల్స్‌లా అల్లు అర్జున్‌ వారసులు అర్హ, అయాన్: ఫోటోలు వైరల్

Updated on Jun 20, 2022 08:30 PM IST
అల్లు అర్జున్ వారసులు అయాన్, అర్హ
అల్లు అర్జున్ వారసులు అయాన్, అర్హ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), స్నేహ రెడ్డిల వారసులు అయాన్, అర్హ.సోషల్‌ మీడియాలో వీళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. పలు ఈవెంట్లలో ఇప్పటికే సందడి చేసిన ఈ స్టార్ కిడ్స్.. తాజాగా వైట్‌ డ్రెస్‌లతో ఫోటో షూట్‌ చేశారు. ఆ ఫోటోలను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెల్ల దుస్తుల్లో ఇద్దరు పిల్లలు ఏంజెల్స్‌లా కనిపిస్తున్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు.

సినిమాలకు ఎంత ప్రయారిటీ ఇస్తారో అంతే ప్రాముఖ్యతను కుటుంబాలకు కూడా ఇస్తుంటారు టాలీవుడ్‌ స్టార్‌‌లు. అందులో భాగంగానే సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఫ్యామిలీతో సహా విదేశాలకు వెళుతుంటారు. అక్కడ పిల్లలతో ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. అదే క్రమంలో ఇటీవల లండన్ టూర్‌‌కు వెళ్లినప్పటి ఫోటోలను షేర్‌‌ చేశారు.

అల్లు అర్హ వెల్‌కం పోస్టర్

తండ్రి బాటలోనే..

ఇక, తండ్రి అల్లు అర్జున్‌ బాటలోనే అర్హ సినిమాల్లోకి అరంగేట్రం చేస్తోంది. స్టార్ హీరోయిన్‌ సమంత మెయిన్‌రోల్‌ పోషిస్తున్న శాకుంతలం సినిమాతో సినిమాల్లోకి అడుగుపెడుతోంది అర్హ. ప్రముఖ కవి కాళిదాసు రచించిన శాకుంతలం నాటకం ఆధారంగా దేవ్‌ మోహన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సమంతకు కొడుకుగా అర్హ నటిస్తోంది. బాల భరతుడి క్యారెక్టర్‌‌ పోషిస్తోంది.  

అల్లు అర్హ వెల్‌కం పోస్టర్

ఇక, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప: ది రూల్‌ సినిమాలో నటిస్తున్నాడు. పుష్ప : ది రైజ్ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌లోని పాటలు సూపర్‌‌హిట్‌ అయ్యాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప2 కూడా పాన్‌ ఇండియా లెవెల్‌లోనే రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్‌ ఇండియా సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా AA21 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

Read More : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) ఇంటి ప్రత్యేకతలు తెలుసా.. సింపుల్‌ అండ్ బ్యూటిఫుల్‌గా ‘బ్లెస్సింగ్‌’ !

అల్లు అర్జున్‌తో అర్హ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!