Pushpa 2: పుష్ప‌ రాజును విదేశాల‌కు తీసుకెళుతున్న సుకుమార్!.. అల్లు అర్జున్‌కు పెరుగుతున్న ఫాలోయింగ్

Updated on Jun 26, 2022 01:44 PM IST
పుష్ప షూటింగ్ సమయంలో డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్‌
పుష్ప షూటింగ్ సమయంలో డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్‌

టాలీవుడ్‌లో అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ కాంబో సినిమాల‌కు ఉన్న క్రేజే వేరు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వచ్చిన పుష్ప‌ రికార్డులు సృష్టించింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా.. ఇండియా మొత్తం పుష్ఫ హ‌వా న‌డిచింది. ప్ర‌స్తుతం సుకుమార్, అల్లు అర్జున్ పుష్ఫ‌2 సినిమాపై ఫోక‌స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో కూడా జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది.  

విదేశాల్లో అల్లు అర్జున్ సీన్స్
ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ఫ సినిమాను తెరకెక్కించారు సుకుమార్. 2021 డిసెంబ‌ర్ 17న విడుద‌లైన పుష్ప.. మొద‌టి రోజు నుంచే క‌లెక్ష‌న్ల పరంగా దూసుకెళ్లింది. అడ‌వుల‌ మ‌ధ్య తీసిన సీన్స్ థియేట‌ర్ల‌లో ప్రేక్షకులకు క‌నువిందు చేశాయి. మారేడుమిల్లి - రంపచోడవరం ఫారెస్టులో తీసిన సీన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

తగ్గేదేలే మ్యానరిజంతో అల్లు అర్జున్

ఇక, పుష్ఫ 2 సినిమా స్టోరీలో భాగంగా కొన్ని సన్నివేశాలను విదేశాల్లో తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఇండోనేషియా, సింగపూర్‌‌లలో కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారని టాక్. ఈ సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ త్వ‌ర‌లో విదేశాల‌కు వెళ్ల‌నున్నారు.  రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేలా పుష్ఫ 2 సినిమాను తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు సుకుమార్. మైత్రీ మూవీ మేక‌ర్స్ , ముత్తంశెట్టి మీడియా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో పుష్ఫ 2 సినిమాను నిర్మిస్తున్నారు. 

ఫాలోయింగ్ పెంచుకున్న పుష్ఫ‌రాజ్
పుష్ప సినిమా విజయంతో అల్లు అర్జున్‌కు బాలీవుడ్‌లోనూ ఫాలోయింగ్ పెరిగింది. పుష్ప సినిమాలో డైలాగులు, పాట‌లు సౌత్‌తోపాటు నార్త్‌లో కూడా పాపుల‌ర్ అయ్యాయి. ‘త‌గ్గేదేలే’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగుకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతగా పాపులర్ అయ్యింది ఆ డైలాగ్. విదేశీయులు, సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ (Allu Arjun) డాన్సులు, డైలాగులతో టిక్ టాక్ వీడియోలు చేశారు. అల్లు అర్జున్ క్రేజ్ త‌గ్గ‌కుండా ఉండేలా పుష్ఫ‌ 2 సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. బ‌ల‌మైన క‌థ‌తో పుష్ఫ2 కూడా పాన్ ఇండియా సినిమాగా విడుద‌ల కానుంది. 

 

పుష్ప సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందాన

దాదాపు ప్ర‌తీ డాన్స్ షోలో అల్లు అర్జున్ (Allu Arjun) డాన్సులు క‌నిపిస్తున్నాయి. క్రికెట‌ర్లు కూడా త‌గ్గేదేలే అంటూ డైలాగులు చెబుతున్నారు. ఓ మ్యాచ్‌లో పుష్ప నుంచి 'ఊ అంటావా మామా' సాంగ్ ప్లే చేశారు. చిన్నా, పెద్దా అంద‌రూ అల్లు అర్జున్ న‌ట‌న‌కు ఫిదా అయ్యారు. పుష్ప సినిమా త‌ర్వాత బ‌న్కినీ ఫాలోయింగ్ మరింతగా పెరిగింది. పుష్ఫ‌లో అల్లు అర్జున్‌కు జోడీగా న‌టించిన ర‌ష్మిక మంద‌న న‌ట‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది.  

Read More: పుష్ప‌ 2 (Pushpa 2) : బడా స్టార్లతో పోటీగా.. సంక్రాంతి బ‌రిలోకి అల్లు అర్జున్ !

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!