ఆది(Aadhi Pinisetty), నిక్కీల పెళ్లి వేడుక టీజ‌ర్ విడుద‌ల‌!., వైభ‌వంగా జ‌రిగిన పెళ్లి

Updated on Aug 13, 2022 05:55 PM IST
త‌మ పెళ్లి జ‌రిగి మూడు నెల‌లు కావొస్తున్నా.. నిన్న‌నే జ‌రిగిన వేడుక‌లా ఉందంటూ ఆది (Aadhi Pinisetty) తెలిపారు.
త‌మ పెళ్లి జ‌రిగి మూడు నెల‌లు కావొస్తున్నా.. నిన్న‌నే జ‌రిగిన వేడుక‌లా ఉందంటూ ఆది (Aadhi Pinisetty) తెలిపారు.

ప్రముఖ సినీ నటులు ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), నిక్కీ గల్రానీల పెళ్లి ఎంతో వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రేమ జంట మే నెల‌లో మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. ఆది, నిక్కీల పెళ్లి వేడుక టీజ‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుక టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. త‌మ పెళ్లి జ‌రిగి మూడు నెల‌లు కావొస్తున్నా.. నిన్న‌నే జ‌రిగిన వేడుక‌లా ఉందంటూ ఆది తెలిపారు. త‌మ పెళ్లికి సంబంధించిన మ‌రిన్ని వీడియోల‌ను త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తెస్తామ‌న్నారు ఆది. 

ప్రేమ - పెళ్లి

ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), నిక్కీ గల్రానీ (Nikki Galrani) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ బంధం పెళ్లిగా మారే క్ష‌ణాల‌తో కూడిన ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేశారు. వీరిద్ద‌రు 2015లో వచ్చిన 'యాగవరైనమ్‌ నా కక్కా' అనే సినిమాలో న‌టించారు. ఆ త‌రువాత వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన‌ 'మరగాధ నాణ్యం' చిత్రంతో ప్రేమలో పడ్డారు. 

‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం’, ’గుడ్‌ లక్‌ సఖి’ వంటి చిత్రాల‌తో ఆది పినిశెట్టి ( Aadhi Pinisetty) మంచి పేరు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ’ది వారియ‌ర్’ చిత్రంలో విల‌న్ పాత్ర‌లో న‌టించి మెప్పించారు. హీరోగానే కాకుండా ఆది స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్లు, విల‌న్ పాత్ర‌ల‌లో న‌టిస్తూ వెండితెర‌పై వినోదం పంచుతున్నారు. 

Read More: Aadhi Pinishetty: పెళ్లి తర్వాత ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ఫొటోలు వైరల్.. కట్నం అంత తీసుకున్నాడా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!