చెన్నైలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay).. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

Updated on Aug 29, 2022 09:41 PM IST
దళపతి విఃయ్‌ (Thalapathy Vijay) ప్రస్తుతం తెలుగులో వారసుడు సినిమా లో నటిస్తున్నారు
దళపతి విఃయ్‌ (Thalapathy Vijay) ప్రస్తుతం తెలుగులో వారసుడు సినిమా లో నటిస్తున్నారు

టాలీవుడ్ హీరోల‌కు సమానంగా తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న న‌టుడు దళ‌ప‌తి విజ‌య్‌ (Thalapathy Vijay). ‘తుపాకి’ సినిమాతో విజయ్‌కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో విజయ్ నటించిన సినిమాలన్నీ తమిళంతోపాటు తెలుగులో కూడా ఒకే సమయంలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

విజయ్‌ నటించిన బీస్ట్‌ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్లాప్‌ టాక్‌ సొంతం చేసుకుంది. విజయ్ కెరీర్‌‌లో భారీ డిజాస్టర్‌‌గా నిలిచింది బీస్ట్‌. ప్రస్తుతం విజయ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు తెలుగులో వారసుడు అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. వారసుడు సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌‌కు మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది.

దళపతి విఃయ్‌ (Thalapathy Vijay) ప్రస్తుతం తెలుగులో వారసుడు సినిమా లో నటిస్తున్నారు

ట్రాఫిక్ పెరిగిపోవడంతోనే..

తాజాగా విజయ్‌ చెన్నైలోని ఒక లగ్జరీ  అపార్ట్‌మెంట్‌లో ఖరీదైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారని టాక్.  విజ‌య్ ప్రస్తుతం చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో నివాసం ఉంటున్నారు. ఆ ఏరియాలో ట్రాఫిక్ విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో వేరే ఇంటిని కొనుగోలు చేసిన‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. చెన్నైలో దాదాపు రూ.35 కోట్లతో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. త‌న ఆఫీస్‌ను కూడా అక్కడికే మార్చేయనున్నారని తెలుస్తోంది.  

విజ‌య్ ప్రస్తుతం వార‌సుడు సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. దిల్‌ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా వ‌చ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుద‌ల కానుంది. ఈ సినిమా తర్వాత లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో మ‌రో సినిమా  చేస్తున్నారు విజయ్ (Thalapathy Vijay). ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా త్వర‌లోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

Read More : Thalapathy Vijay: దళపతి విజయ్ సినిమాకి.. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!