సూర్య (Suriya) 42వ సినిమా కోసం మేకర్స్ అంత ఖర్చు పెడుతున్నారా? బడ్జెట్ తెలిస్తే షాకవ్వాల్సిందే

Updated on Sep 14, 2022 06:39 PM IST
హీరో సూర్య (Suriya) ప్రస్తుతం తన 43వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే సూర్య42 సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు
హీరో సూర్య (Suriya) ప్రస్తుతం తన 43వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే సూర్య42 సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు

సూర్య (Suriya) కావడానికి తమిళ హీరోనే అయినా.. తెలుగులోనూ ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తమిళంతోపాటు సూర్య సినిమాలకు తెలుగులో కూడా క్రేజ్ ఉంది. శివపుత్రుడు, యువ, గజిని, సింగం సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు సూర్య. రజినీకాంత్, కమల్‌ హాసన్‌ తర్వాత ఆ స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సూర్య మాత్రమే అని చెప్పాలి. లోకనాయకుడు కమల్‌ హాసన్ నటించిన ‘విక్రమ్‌’ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేసి అదరగొట్టారు సూర్య.

సూర్య ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్‌పై ఉంచారు. శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. సూర్య42 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. సూర్య42 మోషన్ పోస్టర్ ఇటీవలే రిలీజైంది. ఈ మోషన్ పోస్టర్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.   

హీరో సూర్య (Suriya) ప్రస్తుతం తన 43వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే సూర్య42 సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు

విజువల్‌ వండర్‌‌గా..

ఇదిలా ఉంటే తాజాగా సూర్య42 సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైర‌ల్‌ అవుతోంది. ఈ సినిమా కోసం మేక‌ర్స్ సుమారు రూ.200 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చుపెట్టనున్నార‌ని టాక్. గ్రాండియ‌ర్‌గా, విజువ‌ల్ వండ‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నార‌ని సమాచారం.

ప‌ది భాష‌ల్లో 3డీలోనే సూర్య42 సినిమాను విడుద‌ల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజ‌మెంతో తెలియదు. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ వార్త మాత్రం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. పాన్‌ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న సూర్య42 సినిమాను యూవీ క్రియేష‌న్స్‌, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సూర్య (Suriya)కు జోడీగా బాలీవుడ్ భామ దిశా ప‌టానీ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

Read More : కాలమే సమాధానం చెబుతుందంటున్న స్టార్ హీరోలు సూర్య (Suriya), కార్తీ (Kaarthi).. లోకేశ్ డైరెక్షన్‌పై కామెంట్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!