సూర్య (Suriya) – సిరుతై శివ కాంబినేషన్‌ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ?

Updated on Aug 20, 2022 06:21 PM IST
సూర్య (Suriya) 42వ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ నటించనుందని వార్తలు వస్తున్నాయి
సూర్య (Suriya) 42వ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ నటించనుందని వార్తలు వస్తున్నాయి

బాక్సాఫీస్ హిట్లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన క్యారెక్టర్లు పోషించే నటుడు సూర్య (Suriya). ‘గజిని’, ‘సింగం’, ‘24’ వంటి సినిమాలతో అభిమానులను అలరించారు. సిరుతై శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు సూర్య గతంలోనే తెలిపారు. రెండేళ్ల క్రితమే ప్రకటించిన ఈ ప్రాజెక్టుకు ‘సూర్య-42’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు.

చాలా రోజుల క్రితమే షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ నటించనుందనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

సూర్య (Suriya) 42వ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ నటించనుందని వార్తలు వస్తున్నాయి

రెండు భాగాలుగా..

‘సూర్య-42’ రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టులో దిశా పటానీ హీరోయిన్‌గా నటించనుందని కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మేకర్స్ ఆమెతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. కానీ, దిశా పటాని మాత్రం కాంట్రాక్ట్‌పై సంతకం చేయలేదని తెలుస్తోంది. పదేళ్ల క్రితం సూర్య, దిశా పటాని కలిసి ఒక యాడ్‌లో నటించారు. ‘సూర్య-42’ ను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియాగా సినిమా తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు త్వరలోనే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

ఇక సూర్య కెరీర్ విషయానికి వస్తే.. బాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. వెట్రిమారన్‌తో ‘వాడివసల్’ పట్టాలెక్కించనున్నారు. ఈ మూవీ టెస్ట్ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ముగిసింది. ‘సూరారై పోట్రు’ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు సూర్య (Suriya)

Read More : Hombale Films: సూర్య‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌ల‌తో మ‌ల్టీ సార‌ర్ సినిమా ! హోంబ‌లే ఫిలిమ్స్ ఐడియా అదుర్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!