ఫోన్ల మార్పుతో తారుమారైన జీవితాలు.. ఆసక్తికరంగా ‘లవ్ టుడే’ (Love Today) సినిమా ట్రైలర్

Updated on Nov 17, 2022 03:18 PM IST
ఇద్దరు ప్రేమికులు ఫోన్లు మార్చుకుంటే వారి జీవితాల్లో వచ్చే సమస్యల నేపథ్యంగా ‘లవ్ టుడే’ (Love Today) తెరకెక్కినట్లు అర్థమవుతోంది
ఇద్దరు ప్రేమికులు ఫోన్లు మార్చుకుంటే వారి జీవితాల్లో వచ్చే సమస్యల నేపథ్యంగా ‘లవ్ టుడే’ (Love Today) తెరకెక్కినట్లు అర్థమవుతోంది

ఈ ఏడాది తమిళ చిత్రసీమకు మంచి విజయాలు దక్కాయి. ‘విక్రమ్’, ‘పొన్నియిన్ సెల్వన్ 1’ లాంటి ఇండస్ట్రీ హిట్లు ఈ ఏడాదే రిలీజ్ అయ్యాయి. ఇటీవల విడుదలైన ‘లవ్ టుడే’ (Love Today) మూవీ కూడా ఘన విజయం సాధించడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఫుల్ హ్యాపీగా ఉంది. చిన్న సినిమాగా విడుదలైన ‘లవ్ టుడే’ పెద్ద సినిమాల రేంజ్‌లో కలెక్షన్స్ సాధిస్తోంది. యూత్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయిన ఈ చిత్రం త్వరలో తెలుగులో రిలీజ్ కానుంది. 

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘లవ్ టుడే’ను తెలుగులో విడుదల చేస్తున్నారు. డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో టాలీవుడ్‌లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో గురువారం ‘లవ్ టుడే’ తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ‘నీ గురించి నాకు మొత్తం తెలుసురా’, ‘నాకూ నీ గురించి మొత్తం తెలుసు బేబీ’ అంటూ హీరో, హీరోయిన్స్ మధ్య సాగే లవ్ ట్రాక్‌తో మొదలైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. 

అమ్మాయి తరఫు ఇంటి పెద్దగా సీనియర్ నటుడు సత్యరాజ్ యాక్టింగ్, ఆయన పెట్టిన షరతులు, దాని వల్ల కథానాయకుడు, కథానాయికల మధ్య వచ్చే మనస్పర్థలు.. మధ్యలో కమెడియన్ యోగిబాబు హ్యాస్యంతో సినీ ప్రియులను ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. యువన్ శంకర్ రాజా సంగీతం మెప్పించేలా ఉంది. తమిళంలో సంచలన హిట్‌గా నిలిచిన ‘లవ్ టుడే’ చిత్రం.. తెలుగులో ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి. 

ఇకపోతే, సీనియర్ నటులు రాధికా శరత్ కుమార్, రవీనా రవి, ఇవేనా తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘లవ్ టుడే’ మూవీకి దినేష్​ పురుషోత్తమన్ ఛాయాగ్రహణం అందించారు. ప్రేమ, వినోదం ప్రధానాంశాలుగా రూపొందించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్.అఘోరం నిర్మించారు. ఆసక్తికరమైన కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా మెచ్చుకుంటున్నారు. 

Read more: Ram Charan RC 15 Workout Video: వెకేషన్‌లోనూ తగ్గేదేలే!.. రెస్ట్ లేకుండా చెమటోడ్చుతున్న రామ్ చరణ్​!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!