టికెట్‌కు రూపాయి చొప్పున రైతులకు ఇస్తా.. ‘లాఠీ’ (Laththi) మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో విశాల్ (Vishal) వ్యాఖ్యలు

Updated on Nov 14, 2022 06:51 PM IST
‘లాఠీ’ (Laththi) సినిమా కథ తనకు బాగా నచ్చిందని.. ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని స్టార్ హీరో విశాల్ (Vishal) ఆశాభావం వ్యక్తం చేశారు
‘లాఠీ’ (Laththi) సినిమా కథ తనకు బాగా నచ్చిందని.. ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని స్టార్ హీరో విశాల్ (Vishal) ఆశాభావం వ్యక్తం చేశారు

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal)కు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ‘పందెం కోడి’ చిత్రంతో తెలుగు నాట ఆయన పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘భయ్యా’, ‘పొగరు’, ‘ఇంద్రుడు’, ‘రాయుడు’, ‘అభిమన్యుడు’, ‘డిటెక్టివ్’ మూవీలతో ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. విలక్షణమైన కథలకు ప్రాధాన్యం ఇచ్చే విశాల్.. సామన్య ప్రజలకు సంబంధించిన స్టోరీల్లో కనిపించేందుకూ ఉత్సాహం చూపిస్తుంటారు. 

ఇక, విశాల్ నటించిన తాజా చిత్రం ‘లాఠీ’ (Laththi). రమణ, నంద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను ఎ.వినోద్ కుమార్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా హైదరాబాద్‌లో ఈ చిత్రం టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాల్‌కు ఓ చెడ్డ లక్షణం ఉందని.. తన సినిమా కథ ఎంత బడ్జెట్ అయినా, షూటింగ్ ఎన్ని రోజులైనా విశాల్ చేస్తూనే ఉంటారన్నారు. 

విశాల్‌కు ఓ జబ్బు ఉంది: విజయేంద్ర ప్రసాద్

సినిమా కోసం ఎన్ని రోజులు పని చేయడానికైనా విశాల్ వెనుకాడరని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ లక్షణం ఒక జబ్బుతో సమానమన్నారు. ఇది తన అబ్బాయి రాజమౌళి నుంచి విశాల్‌కు అంటుకుందని పేర్కొన్నారు. విశాల్ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ప్రసంగించారు. అనంతరం విశాల్ మాట్లాడారు. తన కటౌట్‌లను ఏర్పాటుచేసి, తనకు బొకేలు లాంటివి ఇవ్వదని విశాల్ అన్నారు. ఆ డబ్బులతో చిన్నపిల్లలకు సహాయం చేయాలని తన ఫ్యాన్స్‌ను ఆయన కోరారు.  

సినిమా కోసం ఎన్ని రోజులు పని చేయడానికైనా విశాల్ వెనుకాడరని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు

కథ నచ్చితే కౌగిలించుకుంటా లేకపోతే కొడతా..!: విశాల్

‘నేను జీవితంలో చాలా కిందస్థాయిలో ఉండే కష్టాలను చూశా. అలాగే గొప్ప వాళ్లు పొందే సంతోషాన్నీ చూశా. స్కూల్‌, కాలేజీల్లో చెప్పే పాఠాల కంటే సినిమా నేర్పించే పాఠాలు చాలా గొప్పవి. నాకు మొదటి నుంచి ఒక అలవాటు ఉంది. నా దగ్గరకు వచ్చి ఎవరైనా కథ రికమెండ్ చేస్తే.. అది బాగుంటే వెంటనే వాళ్లను కౌగిలించుకుంటా. ఒకవేళ నచ్చకపోతే లోపలికి పిలిచి తలుపులు వేసి మరీ వాళ్లను కొడతా(నవ్వుతూ..). కానీ ‘లాఠీ’ కథ నాకు బాగా నచ్చింది. మీ అందరికీ తప్పక నచ్చుతుంది. నా ప్రతి చిత్రంలానే.. ఈ సినిమాను ఎంత మంది చూస్తారో ఆ డబ్బుల్లో.. ఒక టికెట్‌కు ఓ రూపాయి చొప్పున రైతులకు ఇస్తా’ అని విశాల్ చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Read more: Karthi Facebook: కోలీవుడ్ స్టార్ హీరో కార్తి ఫేస్‌‌బుక్ అకౌంట్ హ్యాక్.. వైరల్ అవుతున్న ట్వీట్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!