రిషబ్ శెట్టి (Rishab Shetty)కి రజినీకాంత్ (Rajinikanth) సన్మానం.. ‘కాంతార’ (Kantara) యూనిట్‌పై తలైవా ప్రశంసలు

Updated on Oct 29, 2022 01:14 PM IST
కాంతార’ (Kantara) సినిమా దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty)ని తలైవా రజినీకాంత్ (Rajinikanth) సన్మానించారు
కాంతార’ (Kantara) సినిమా దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty)ని తలైవా రజినీకాంత్ (Rajinikanth) సన్మానించారు

శాండల్‌వుడ్ రికార్డులను తిరగరాస్తోంది ‘కాంతార’ (Kantara) మూవీ. ఈ సినిమా గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. చిన్న చిత్రంగా కన్నడ నాట రిలీజైన ‘కాంతార’.. ఇవ్వాళ దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. కన్నడలో ‘కేజీఎఫ్​’ తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించిన చిత్రం ‘కాంతార’ అనే చెప్పాలి. కలెక్షన్ల పరంగా కన్నడ చిత్ర పరిశ్రమలో మూడో స్థానంలో ఈ మూవీ నిలిచింది. 

‘కాంతార’ చిత్రం భాషలతో సంబంధం లేకుండా పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సాధారణ ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. అన్ని ఇండస్ట్రీల సెలబ్రిటీలు కూడా ‘కాంతార’ను మెచ్చుకుంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఈ సినిమాను చూశారు. అనంతరం రిషబ్ శెట్టి (Rishab Shetty)ని తలైవా స్వయంగా కలసి అభినందించడం ఆసక్తిగా మారింది. రిషబ్ శెట్టిని రజినీ సన్మానించారు. ‘తెలిసినది గోరంత తెలియనది కొండంత.. ఈ విషయాన్ని సినిమాల్లో మీ కంటే బాగా ఎవరూ చెప్పలేరు’ అని నిర్మాణ సంస్థ హోంబాలే ప్రొడక్షన్స్‌ను రజినీ మెచ్చుకున్నారు. 

రజినీకాంత్ తన చిత్రం చూడటంపై రిషబ్ శెట్టి స్పందించారు. ఈ విషయం మీద ఆయన ట్వీట్ చేశారు. ‘మీరు ఒక్కసారి మెచ్చుకుంటే వందసార్లు మెచ్చకున్నట్లే. కృతజ్ఞతలు రజినీ సార్. మా ‘కాంతార’ చిత్రాన్ని మీరు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని రిషబ్ పోస్ట్ చేశారు. రజినీకి పాదాభివందనం చేస్తూ ఆశీర్వాదం తీసుకున్న ఫొటోలను ఆయన షేర్ చేశారు.   

ఇకపోతే, తెలుగులో కూడా ‘కాంతార’ ప్రభంజనం సృష్టించింది. టాలీవుడ్‌లో రిలీజైన తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. ఇప్పుడు రూ.50 కోట్ల మార్కును అందుకునే దిశగా దూసుకెళ్తోంది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగు నాట ఊహించని విక్టరీ కొట్టడంతో ఇక్కడి ఆడియెన్స్‌ను నేరుగా కలిసేందుకు ‘కాంతార’ టీమ్ సక్సెస్ టూర్ నిర్వహిస్తోంది. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ఈ సక్సెస్ టూర్‌లో చిత్ర దర్శకుడు, కథానాయకుడు రిషబ్ శెట్టి పాల్గొంటున్నారు. 

Read more: రిషబ్ శెట్టి (Rishab Shetty) మూవీ ‘కాంతార’ (Kantara) ఓటీటీ స్ట్రీమింగ్ రూమర్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!