తెలుగు స్టేట్‌లో ‘కాంతార’ (Kantara) సక్సెస్ టూర్.. ప్రేక్షకులను కలవనున్న హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty)

Updated on Oct 28, 2022 05:59 PM IST
తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు రిషబ్ శెట్టి (Rishab Shetty) సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నారు
తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు రిషబ్ శెట్టి (Rishab Shetty) సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నారు

కన్నడ సినిమా ‘కాంతార’ (Kantara) బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేశారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగులో ఊహించని స్థాయిలో ‘కాంతార’ విజయవంతం కావడంతో మూవీ టీమ్ సక్సెస్ టూర్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. అక్టోబర్ 29 (శనివారం)వ తేదీన తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్లను ‘కాంతార’ యూనిట్ సందర్శించనున్నారు. 

ఆడియెన్స్‌ను కలిసేందుకు ప్లాన్

తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న ‘కాంతార’ సక్సెస్ టూర్‌లో చిత్ర దర్శకుడు, కథానాయకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) పాల్గొననున్నారు. ఆయనతోపాటు హీరోయిన్ సప్తమి గౌడ కూడా పాల్గొననున్నారని తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను ఇంత భారీ హిట్‌ను చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ టూర్‌ను నిర్వహిస్తున్నారు. కన్నడతోపాటు తెలుగు, హిందీల్లో ‘కాంతార’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తమిళ, మలయాళ వెర్షన్లకూ కలెక్షన్లు బాగున్నాయని ట్రేడ్ టాక్. దీంతో అన్ని చోట్ల సక్సెస్ టూర్ల ద్వారా ఆడియెన్స్‌ను కలిసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 

సక్సెస్ టూర్ల ద్వారా ఆడియెన్స్‌ను కలిసేందుకు ‘కాంతార’ (Kantara) మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది

మళ్లీ థియేటర్ల పెంపు

కన్నడలో చిన్న చిత్రంగా రిలీజైన ‘కాంతార’ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. భాషలతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలోనూ బ్రేక్ ఈవెన్ సాధించి.. అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు, తమిళంలో దీపావళికి రిలీజైన సినిమాల నుంచి పోటీని తట్టుకుని ‘కాంతార’ చిత్రం స్టడీగా కలెక్షన్లను సాధించింది. దీపావళి మూవీస్ జోరు తగ్గడంతో.. ‘కాంతార’ను ప్రదర్శించే థియేటర్ల సంఖ్యను పెంచుతున్నారు. వచ్చే వారం వరకు పెద్ద చిత్రాల రిలీజ్‌లు లేకపోవడంతో ఈ మూవీ లాంగ్ రన్‌కు ఢోకా లేదనే చెప్పాలి. 

ఇకపోతే, శాండల్‌వుడ్ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ను స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆయన సరసన సప్తమి గౌడ (Sapthami Gowda) కథానాయికగా యాక్ట్ చేశారు. అచ్యుత్ కుమార్, కిషోర్, ప్రమోద్ శెట్టి ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ‘విక్రాంత్ రోణ’ ఫేమ్ అజినీష్ లోక్‌నాథ్ ‘కాంతార’కు సంగీతం అందించారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ హోంబాలే ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.   

Read more: నిత్యామీనన్ (Nithya Menen) తల్లి కాబోతోందా.. ప్రెగ్నెన్సీ కిట్ పోస్ట్ చేసిన బ్యూటీ.. షాక్ లో ఫ్యాన్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!