జపాన్ లో 'ఆర్ఆర్ఆర్' (RRR) జైత్రయాత్ర మామూలుగా లేదుగా.. 17రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు!

Updated on Nov 08, 2022 12:03 PM IST
 ‘ఆర్ఆర్ఆర్’ (RRR Release in Japan) మూవీని ఇటీవల జపాన్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
‘ఆర్ఆర్ఆర్’ (RRR Release in Japan) మూవీని ఇటీవల జపాన్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్' (RRR). ఎన్నో వాయిదాల త‌ర్వాత మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్ కొల్లగొట్టి వ‌సూళ్ళ ప్ర‌భంజ‌నం సృష్టించింది.

‘బాహుబ‌లి-2’ పేరిట ఉన్న ఎన్నో రికార్డుల‌ను బ్రేక్‌ చేసింది 'ఆర్ఆర్ఆర్' (RRR). ఒక్క తెలుగులోనే కాకుండా విడుదలైన ప్రతి భాషలో డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌ల న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. రాజ‌మౌళి టేకింగ్, విజ‌న్‌తో మ‌రోసారి మాయ చేశాడు. ఈ సినిమాతో ఇండియాలో రెండు సార్లు రూ.1000కోట్ల మార్కును ట‌చ్ చేసిన ఏకైక ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి రికార్డు సృష్టించాడు.

ఇక, ‘ఆర్ఆర్ఆర్’ (RRR Release in Japan) మూవీని ఇటీవల జపాన్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 17 రోజుల్లో 185 మిలియన్‌ జపనీస్ యెన్‌‌లను వసూలు చేసింది. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.10.34 కోట్లు అన్నమాట. ఇప్పటి వరకు జపాన్‌లో 1,22,727 మంది RRR సినిమాను వీక్షించారు. ఆ దేశంలో వచ్చిన కలెక్షన్లను చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 

ఇక జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన ‘ముత్తు’ (400 మిలియన్ జపనీస్ యెన్‌లు) మొదటి స్థానంలో ఉండగా.. ‘బాహుబలి 2’ (300మిలియన్ యెన్‌లు) రెండో స్థానంలో ఉంది.  ఆమిర్ ఖాన్ ‘3ఇడియట్స్’ సాధించిన 170మిలియన్ యెన్‌ల కలెక్షన్‌ను RRR దాటేసి మూడో స్థానాన్ని ఆక్రమించింది. మరి ఈ సారైనా ముత్తు రికార్డును ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బ్రేక్‌ చేస్తుందో లేదో చూడాలి. బిగ్గెస్ట్‌ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఇండియాలో రూ.1200 కోట్ల వరకు వసూలు చేసింది.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి (SS Rajamouli) జపాన్ వెళ్లి సినిమాను ప్రచారం చేశారు. ప్రచార సమయంలోనే RRRకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 21న అక్కడి థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో ఈ మూవీని అక్కడి ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారి కలిసినప్పుడు వచ్చే బ్రిడ్జ్ సీన్‌కి ఓ థియేటర్‌లో ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ, గోలగోల చేస్తూ ఎంజాయ్ చేశారు.

Read More: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శితం కాబోతున్న 'ఆర్ఆర్ఆర్' (RRR), అఖండ (Akhanda)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!