RRR: ఆర్.ఆర్.ఆర్ 100 రోజులు పూర్తి.. హుషారెత్తించే ఫోటోను రిలీజ్ చేసిన మేకర్స్
టాలీవుడ్‌లో ఆర్.ఆర్.ఆర్.(RRR) సినిమా 100 రోజలు పూర్తి చేసుకుంది. రౌద్రం రణం రుధిరం పేరుతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచింది. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి, కొమురం భీముడిగా రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ఫోటోను రిలీజ్ చేసింది.
వసూళ్ల పరంగానే ఆర్.ఆర్.ఆర్. వేయి కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది.
ఆర్.ఆర్.ఆర్ హాలీవుడ్ అవార్డుకు నామినేష్‌న్‌కు ఎంపికైంది. ఆర్.ఆర్.ఆర్. మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ బాషలలో విడుదల అయింది. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఆర్.ఆర్.ఆర్. నిర్మించారు. ఈ సినిమాను కీరవాణి సంగీతం అందించగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు.
ఆర్.ఆర్.ఆర్.కు మరో రికార్డు
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్టులలో ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆర్.ఆర్.ఆర్ (RRR) నామినేషన్ పొందింది. ఈ చిత్రం సోషల్ మీడియా విభాగం ఈ విషయాన్ని తెలిపింది. ఉత్తమ సినిమా కేటగిరీలో ఆర్.ఆర్.ఆర్. నామినేషన్ పొందడం సంతోషంగా ఉందని తెలిపింది.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్టుకు ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా పోటీ పడలేదు. ఆర్.ఆర్.ఆర్ ఉత్తమ చిత్రం కేటగిరిలో మరో 9 హాలీవుడ్ చిత్రాలతో పోటీపడుతుంది. ఆర్.ఆర్.ఆర్. సినిమా రన్నరప్ గా నిలిచినా ఏకైక ఇండియన్ సినిమా విజయం సాధించింది.
కలెక్షన్ల మోత మోగించిన ఆర్.ఆర్.ఆర్ (RRR).
2022 మార్చి 25న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ చేశారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు.
ఆర్.ఆర్.ఆర్ (RRR) చిత్రాన్ని రూ. 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. బాహుబలి 2 తర్వాత ఆర్.ఆర్.ఆర్ సినిమాతో రాజమౌళి ఇండియన్ సినిమా రికార్డులను మరోసారి తిరగరాశారు. ఈ సినిమా దాదాపు రూ. 1200 కోట్లను వసూళ్లు చేసింది. హిందీలో ఆర్.ఆర్.ఆర్. రూ. 274.31 కోట్లను రాబట్టింది. అత్యధిక వసూళ్లను రాబట్టిన నాలుగో భారతీయ చిత్రంగా నిలిచింది.