ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR) సినిమాలో.. ‘నాటు..నాటు’ పాటపై క్యాప్ జెమినీ చైర్మన్‌ ఛాలెంజ్ !

Updated on Jun 13, 2022 07:02 PM IST
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR) సినిమా పోస్టర్, క్యాప్ జెమినీ చైర్మన్ పాల్‌ హెర్మెలిన్
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR) సినిమా పోస్టర్, క్యాప్ జెమినీ చైర్మన్ పాల్‌ హెర్మెలిన్

రాంచరణ్‌, జూనియర్ ఎన్టీఆర్.. ఇద్దరూ గొప్ప డ్యాన్సర్లు. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వీళ్ల డ్యాన్స్‌కి ఫిదా అవుతారు. అలాంటి ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ చేస్తే ఎంత నాటుగా ఉంటుందో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా ద్వారా రాజమౌళి మనందరికీ చూపించాడు.

‘నాటు నాటు’ అంటూ ఇద్దరు స్టార్‌ హీరోలూ వేసిన స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లాయి. విదేశాల్లోనూ చాలామంది ఈ పాటకు కాలు కదిపి.. వీడియోలు షేర్‌ చేశారు.

కాగా, ఇప్పుడు ఇదే పాటపై ఛాలెంజ్‌ విసిరారు ప్రముఖ బిజినెస్‌మ్యాన్ క్యాప్‌ జెమినీ చైర్మన్‌ పాల్ హెర్మెలిన్. బిజినెస్‌ పనుల నిమిత్తం ఇండియా వచ్చిన పాల్‌.. స్నేహితుడి సలహాతో ‘నాటు నాటు’ పాట చూశాడు. ‘రెండు సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చా. మూడు రోజులపాటు బిజినెస్‌ పనులు ముగించుకున్న తర్వాత రిటర్న్ అయ్యాను.

ఇటీవల విడుదలైన భారతీయ చిత్రాల్లోని ఏదైనా సూపర్‌ హిట్‌ సాంగ్‌ వినాలనుకున్నప్పుడు నా స్నేహితుడు మురళి ఇచ్చిన సూచనతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాచో నాచో’ (హిందీ వెర్షన్) వీడియో సాంగ్‌ చూశాను. కొన్ని రోజుల క్రితం ఇది ఒక పాట మాత్రమే.

ఇప్పుడు ఒక ఆచారంలా మారిపోయింది. ఈ పాటకు మీరూ డ్యాన్స్‌ చేయగలరా? నా భారతీయ మిత్రులందరి నుంచి ఈ వారం వీడియోలను ఆహ్వానిస్తున్నా’ అని ఆయన తన లింక్‌డ్‌ ఇన్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు.

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR) సినిమా పోస్టర్

వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్‌..

బిగ్గెస్ట్‌ యాక్షన్‌ బ్లాక్‌బస్టర్‌గా తెరకెక్కినన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. రాం, -భీమ్‌గా రాంచరణ్‌, తారక్‌ నటన అందరినీ మెప్పిస్తోంది. సుమారు రూ.450 కోట్లతో తెరకెక్కిన ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ (RRR) సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.1,000 కోట్లకు పైగా వసూలు చేసిందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు.

Read More: RC 15 తర్వాత.. శంకర్ (Shankar) తో సినిమా చేసే టాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరు ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!