బాలీవుడ్ (Bollywood) వెబ్ సిరీస్ లో మరోసారి యాక్షన్ సీక్వెన్స్ లో అలరించబోతున్న సమంత (Samantha)

Updated on Aug 26, 2022 05:59 PM IST
ప్రస్తుతం మరోసారి మరో సంచలన పాత్రలో నటించడానికి సమంత (Samantha) రెడీ అవుతోందంటూ వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం మరోసారి మరో సంచలన పాత్రలో నటించడానికి సమంత (Samantha) రెడీ అవుతోందంటూ వార్తలు వస్తున్నాయి.

సౌతిండియా స్టార్ హీరోయిన్ లలో ఒకరైన సమంత (Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి అయిన తరువాత, భర్త నుంచి విడిపోయిన తరువాత కూడా సమంతలో ఏమాత్రం జోరు తగ్గడం లేదు. తెలుగు,త‌మిళం,హిందీ భాష‌ల్లో ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీగా ఉంటుంది ఈ అమ్మడు. అయితే, ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. వెబ్ సిరీస్ లతోనూ తన సత్తా చాటుతోంది. 

ఇప్పటికే సమంత.. 'ది ఫ్యామిలీ మెన్‌–2' (The Family Man 2) హిందీ వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌ రంగప్రవేశం చేయడంతో పాటు, ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు తనదైన శైలిలో విలనిజాన్ని ప్రదర్శంచడంతో పాటు గ్లామరస్‌గానూ నటించి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది. బోల్డ్ సన్నివేశాల్లో మాత్రమే కాకుండా, యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించి సంచలనం క్రియేట్ చేసింది. 

ఇక ప్రస్తుతం మరోసారి మరో సంచలన పాత్రలో నటించడానికి సమంత రెడీ అవుతోందంటూ వార్తలు వస్తున్నాయి. 'ది ఫ్యామిలీ మెన్‌' వెబ్‌ సిరీస్‌ను రూపొందించిన రాజ్,డీకే (Raj&DK) తాజాగా దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్న వెబ్‌ సిరీస్‌లో సమంత నటించనున్నారన్నది తాజా సమాచారం. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన సిట్టాల్ అనే సిరీస్ ను భారతీయ భాషల్లో రీమేక్ చేయబోతున్నారట. ఇందులో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) పాత్రలో సామ్ నటించ బోతున్నట్టు సమాచారం అందుతోంది. 

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో సమంత (Samantha With Varun Dhawan)

బాలీవుడ్ నటుడు వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan), సమంత జంటగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్‌ సన్నివేశాలకు అధిక ప్రాముఖ్యత ఉండటంతో ఇప్పుడు వారిద్దరూ ఆత్మరక్షణ విలువిద్యలో శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. వీరికి అమెరికాకు చెందిన స్టంట్‌ మాస్టర్‌ శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుందని సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం స‌మంత మార్ష‌ల్ ఆర్ట్స్ లో శిక్ష‌ణ తీసుకోవ‌డం మొద‌లుపెట్టింద‌ట‌ సమంత. 

ఇదిలా ఉంటే.. సామ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. ఒకటీ, రెండు సినిమాలు మాత్రమే చిత్రీకరణ దశలో ఉన్నాయి. అందులో విజయ్‌ దేవరకొండతో (Vijay Deverakonda) నటిస్తున్న 'ఖుషీ' మూవీ ఒకటి. కాగా, సామ్ గత కొంతకాలంగా ముంబయి నుంచి హైదరాబాద్‌కు జర్నీలు చేస్తూ వస్తోంది. దీంతో ముంబయిలోనే రూ.30కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసిందని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది.

Read More: చైతూ నుంచి సమంతకు (Samantha) భరణంగా రూ. 250 కోట్లు.. వార్నింగ్ ఇస్తూ నటుడు బ్రహ్మాజీ(Brahmaji) ఘాటు వ్యాఖ్యలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!