Samantha : నాగచైతన్యను (Naga Chaitanya) మర్చిపోలేకపోతున్న సమంత.. మళ్లీ ఆ ఇంటినే కొనుగోలు చేసిన సామ్!
అక్కినేని నాగచైతన్య, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రేమించి పెళ్ళి చేసుకొన్న సంగతి తెలిసిందే. 2017 లో గోవాలో పెద్దల సమక్షంలో ఇరు సాంప్రదాయాల ప్రకారం, అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. కానీ, ఎక్కువ కాలం వీరు కలిసి ఉండలేకపోయారు. కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకుని సామ్ - చైతూ సపరేట్ అయిపోయారు.
అయితే, నాగచైతన్యతో (Akkineni Nagachaitanya) విడాకుల తర్వాత, సమంత మీద విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. ఆమె ఏం చేసినా తప్పుపట్టారు నెటిజన్లు. అంతేకాదు, చైతూ నుంచి కోట్లాది రూపాయలు భరణం తీసుకుందని, ఆస్తి రాయించుకుందని ఏవేవో పుకార్లు వ్యాప్తి చెందాయి. అయితే ఇటీవలే 'కాఫీ విత్ కరణ్ షో'లో పాల్గొన్న సామ్ అవన్నీ అసత్యపు ప్రచారాలేనని కుండబద్ధలు కొట్టేసింది.
కాగా, నాగచైతన్య- సమంత బ్రేకప్ తర్వాత ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. ఇద్దరూ సినిమాలతో బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వార్త తెగ వైరలవుతోంది. సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. 'పెళ్లైన తర్వాత చైతూ సామ్ పేరుమీద ఒక ఫ్లాట్ తీసుకున్నాడని, అందులోనే వారిద్దరూ జీవించడానికి నిర్ణయించుకున్నారని' సీనియర్ నటులు మురళీ మోహన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
'ఇంతలోనే మనస్పర్థలు వచ్చి చైతూ-సామ్ విడిపోయారు. ఆ తర్వాత మంచి ఇంటి కోసం సమంత చాలా వెతికింది. కానీ, ఏదీ నచ్చలేదు. దీంతో చివరకు సేఫ్టీతో పాటు సౌకర్యాలు కూడా ఇక్కడే బాగుంటాయని భావించి.. అంతకుముందు అమ్మేసిన అపార్ట్‌మెంటే (Samantha Apartment) తనకు కావాలంటూ సమంత నా దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆ ఇల్లు కొన్నవాళ్లతో మాట్లాడి, వారికి ఇంకా ఎక్కువ డబ్బులు చెల్లించాం. ఆ విధంగా ఆ ఇంటిని తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం అక్కడే, తన తల్లితో కలిసి నివసిస్తోంది' అంటూ మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.
Read More: బాలీవుడ్ లో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన సమంత.. స్టార్ హీరో సరసన అవకాశం!