చైతూ నుంచి సమంతకు (Samantha) భరణంగా రూ. 250 కోట్లు.. వార్నింగ్ ఇస్తూ నటుడు బ్రహ్మాజీ(Brahmaji) ఘాటు వ్యాఖ్యలు

Updated on Aug 21, 2022 07:43 PM IST
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మజీ (Actoe Brahmaji) సమంతపై (Samantha) విమర్శలు గుప్పిస్తున్న వారికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మజీ (Actoe Brahmaji) సమంతపై (Samantha) విమర్శలు గుప్పిస్తున్న వారికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Actress Samantha), అక్కినేని నాగ చైతన్య (Naga Chaitnya) విడిపోయి నెలలు గడుస్తున్నా ఏదో ఒక రూపంలో ఈ విషయం చర్చకు వస్తూనే ఉంది. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సమయంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వార్తలు వినిపించాయో మనందరికీ తెలిసిందే. ఎక్కువగా సమంతని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ చేశారు. ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారు మాట్లాడుతూ కొత్త కొత్త రూమర్స్ ని సృష్టించారు. 

సమంత భరణం రూపంలో రూ.250 కోట్ల రూపాయలు చైతన్య వద్ద తీసుకున్నారనే మాట గట్టిగా వినిపించింది. ఈ పుకార్లపై టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ (Actor Brahmaji) తీవ్రస్థాయిలో స్పందించాడు. 'నేను అన్ని విషయాల్లో దూరను. కానీ మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా నోరు మెదుపుతాను. సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. నాగచైతన్య దగ్గరి నుంచి రూ.250 కోట్లు భరణం తీసుకుని గేమ్‌ ప్లే చేశావు, నువ్వో సెకండ్‌ హ్యాండ్‌ అంటూ చీప్‌గా మాట్లాడాడు' అని పేర్కొన్నాడు.

ఈ కామెంట్లకు సమంత ఘాటుగా రిప్లై ఇచ్చింది.. అయితే, అతడి మాటలకు కోపమొచ్చి నేనూ స్పందించానని పేర్కొన్నాడు బ్రహ్మాజీ (Actor Brahmaji). తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మజీ సమంతపై విమర్శలు గుప్పిస్తున్న వారికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. నెటిజన్స్ సెలబ్రిటీల గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. సెలబ్రిటీల జీవితం పై వ్యక్తిగతంగా కామెంట్స్ చేసే హక్కు మనకు లేదు అంటూ ఘాటుగా స్పందించారు బ్రహ్మజీ. 

నాగ చైతన్య, సమంత జంట (Naga Chaitanya, Samatha)

సమంత హీరోయిన్ కాబట్టి ఆమె సినిమాల గురించి, నటన గురించి కామెంట్ చేయవచ్చు. వ్యక్తిగత విషయాల ఉద్దేశిస్తూ మాట్లాడే హక్కు ఎవరికీ ఉండదు. కారణం ఏదైనా సమంత, చైతన్య (Naga Chaitanya) విడాకులు తీసుకున్నారు. ఎందుకో వారిద్దరికీ కుదరలేదని.. బ్రహ్మాజీ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే సమంత చాలా మంచిదని... ఆమె తన కష్టం, టాలెంట్ తోనే పైకొచ్చిందని పేర్కొన్నారు. ఆమెకి ఎవరూ సహాయం చేయాల్సిన అవసరం లేదని.. సమంత ఒక్క రూపాయి కూడా ఊరికే తీసుకోదు అని చెప్పుకొచ్చాడు బ్రహ్మజీ.

చైతూ-సమంత (Samantha) 'ఏం మాయ చేసావే' సినిమా సమయంలో ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలనీ నిజం చేస్తూ ఒక్కసారిగా గత ఏడాది విడిపోతున్నాం అంటూ ప్రకటించారు. 

దీంతో ఈ వార్త విన్న వారి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే.. చైతూ-సామ్ (Chaitu-Sam) జంట విడాకులు తీసుకుని దాదాపు 11 నెలలు అవుతున్నా కూడా విడాకులకు గల అసలు కారణం ఏంటి అనేది ఇంతవరకు తెలియలేదు.

Read More: Samantha : నాగచైతన్యను (Naga Chaitanya) మర్చిపోలేకపోతున్న సమంత.. మళ్లీ ఆ ఇంటినే కొనుగోలు చేసిన సామ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!