మాస్ లుక్ లో సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth).. 'జైలర్' మూవీ (Jailer First Look) ఫస్ట్ లుక్ రిలీజ్..!

Updated on Aug 22, 2022 03:00 PM IST
జైలర్ చిత్ర బృందం తాజాగా క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. సోమ‌వారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను (Jailer First Look Poster) విడుద‌ల చేశారు.
జైలర్ చిత్ర బృందం తాజాగా క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. సోమ‌వారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను (Jailer First Look Poster) విడుద‌ల చేశారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఈ మధ్య కాలంలో యువ దర్శకులకు ఎక్కువగా అవకాశాలిస్తూ దూసుకెళ్తున్నారు. ‘కబాలి’ (Kabali) సినిమా నుంచి ఆయన వారి దర్శకత్వంలో పని చేస్తున్నారు. పా.రంజిత్, కార్తీక్ సుబ్బరాజ్.. శివతో సినిమాలు చేస్తూ వచ్చారు. రజినీని కొత్తగా చూపించడంలో యువ దర్శకులు సక్సెస్ అయ్యారు. 

ఈ నేపథ్యంలో ఆయన తాజాగా 'జైలర్'గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది పెద్దన్న (అన్నాత్తే) సినిమాతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఆయ‌న ఇప్పుడు జైల‌ర్ (JAILER) అంటూ రాబోతున్నారు. 'బీస్ట్‌' మూవీఫేం నెల్సన్‌ దర్శకత్వంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. స‌న్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను రూపొందిస్తోంది. 

ఇటీవల మూవీ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. సోమ‌వారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను (Jailer First Look Poster) విడుద‌ల చేశారు. గ‌డ్డంతో స్టైల్‌గా చేతులు వెన‌క్కి క‌ట్టుకుని న‌డుస్తోన్న ర‌జినీకాంత్‌ను ఈ పోస్ట‌ర్‌లో మ‌నం గ‌మ‌నించవ‌చ్చు. 'జైలర్' మూవీలో ర‌జినీకాంత్‌ ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్‌ను తలైవా ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో నెట్టింట వైరల్ చేస్తున్నారు.   

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) తయారు చేసుకునే కథలు .. ఆయన స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటాయి. స్టార్ హీరోల సినిమాలను తక్కువ బడ్జెట్ లో చేయడం ఆయన ప్రత్యేకత. ఇదే విషయాన్ని 'బీస్ట్' (Beast) సినిమా నిరూపించింది. అందువల్లనే సన్ పిక్చర్స్ వారు ఆయనకి మరో ఛాన్స్ ఇచ్చారు.

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!