క‌ళ్ల‌తోనే అన్ని హావ‌భావాలు పండించే క‌థానాయిక‌ మీనా (Meena).. హ్యాపీ బ‌ర్త్ డే "అమ్మాయి గారు" !

Updated on Sep 16, 2022 06:15 PM IST
ఓ బ‌ర్త్ డే పార్టీలో మీనా (Meena) ను చూసిన నటుడు శివాజీ గణేషన్, త‌న సినిమాలో బాల న‌టిగా న‌టించే అవ‌కాశం క‌ల్పించారు.
ఓ బ‌ర్త్ డే పార్టీలో మీనా (Meena) ను చూసిన నటుడు శివాజీ గణేషన్, త‌న సినిమాలో బాల న‌టిగా న‌టించే అవ‌కాశం క‌ల్పించారు.

ద‌క్షిణాది క‌థానాయిక  మీనా (Meena) బాల న‌టిగా సినీ జీవితాన్ని ప్రారంభించినా.. త‌రువాత హీరోయిన్‌గా తెలుగు, త‌మిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. దక్షిణాదిలో అగ్ర హీరోలు అందరితోనూ మీనా న‌టించడం ఒక ఎత్తు అయితే.. బాల న‌టిగా ఏ హీరో సినిమాల్లో న‌టించారో, మళ్లీ అదే హీరో సినిమాలో ఆమె హీరోయిన్‌గా న‌టించి మెప్పించడం గమనార్హం. ద‌క్షిణాదికి చెందిన అన్ని భాష‌ల్లోనూ న‌టించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మీనా, తన క‌ళ్ల‌తోనే యాక్టింగ్ చేస్తుంటారని ఆమె అభిమానులు అంటుంటారు.

ఓ బ‌ర్త్ డే పార్టీలో మీనా (Meena) ను చూసిన నటుడు శివాజీ గణేషన్, త‌న సినిమాలో బాల న‌టిగా న‌టించే అవ‌కాశం క‌ల్పించారు.

మీనా (Meena) 1975లో సెప్టెంబ‌ర్ 16 తేదిన జ‌న్మించారు. త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డిన తెలుగు కుటుంబానికి చెందిన  దురైరాజ్, రాజ‌మ‌ల్లిక‌ల కుమార్తె మీనా. మీనా తండ్రి ఓ ఉపాధ్యాయుడు. అలాగే త‌ల్లి రాజ‌మ‌ల్లిక అల‌నాటి త‌మిళ సినిమా న‌టి. 

ఓ బ‌ర్త్ డే పార్టీలో మీనాను చూసిన నటుడు శివాజీ గణేషన్, త‌న సినిమాలో బాల న‌టిగా న‌టించే అవ‌కాశం క‌ల్పించారు. అలా బాల న‌టిగా మీనా సినీ ప్రస్థానం మొదలైంది. ఆ త‌రువాత శివాజీ గ‌ణేష‌న్ న‌టించిన చాలా సినిమాల్లో బాల న‌టిగా న‌టించిన మీనా, తన పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఓ బ‌ర్త్ డే పార్టీలో మీనా (Meena) ను చూసిన నటుడు శివాజీ గణేషన్, త‌న సినిమాలో బాల న‌టిగా న‌టించే అవ‌కాశం క‌ల్పించారు.

తెలుగులో సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన "సిరిపురం మొన‌గాడు" చిత్రంలో మీనా బాల‌న‌టిగా న‌టించారు. ఆ తర్వాత ఇల్లాలు ప్రియురాలు, బావ మ‌ర‌ద‌ళ్లు, కోడె త్రాచు, రెండు రెళ్ల ఆరు, ఖూనీ, సిరివెన్నెల వంటి చిత్రాల‌లో ఆమె బాల న‌టిగా నటించి మెప్పించారు. దాదాపు 30 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచారు.

ఓ బ‌ర్త్ డే పార్టీలో మీనా (Meena) ను చూసిన నటుడు శివాజీ గణేషన్, త‌న సినిమాలో బాల న‌టిగా న‌టించే అవ‌కాశం క‌ల్పించారు.

రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ చేసిన ‘నవయుగం’ సినిమాతో మీనా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది తమిళంలోనూ ఫిమేల్ లీడ్‌గా కనిపించారు. 1991 లో విడుద‌లైన‌ "సీతారామ‌య్య‌గారి మ‌నుమ‌రాలు" సినిమాలో ఏఎన్నార్‌కు మ‌నుమ‌రాలిగా న‌టించిన మీనాకు నంది అవార్డు ల‌భించింది. 

ఓ బ‌ర్త్ డే పార్టీలో మీనా (Meena) ను చూసిన నటుడు శివాజీ గణేషన్, త‌న సినిమాలో బాల న‌టిగా న‌టించే అవ‌కాశం క‌ల్పించారు.

అలాగే తెలుగులో చంటి, సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, కొంగుచాటు కృష్ణుడు, అల్లరి పిల్ల, రాజేశ్వరీ కళ్యాణం, మొరటోడు నా మొగుడు లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు మీనా. పెళ్లాం చెబితే వినాలి, అబ్బాయిగారు లాంటి సినిమాల్లో రెబ‌ల్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.

హీరోయిన్‌గా తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో కొన్నేళ్ల పాటు టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించి అగ్ర క‌థానాయ‌కురాలిగా ఎదిగారు మీనా. సినిమా రంగంలోకి చిన్న‌త‌నంలోనే రావ‌డంతో, మీనా ఎనిమిద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివారు. ఆ త‌రువాత దూరవిద్య ద్వారా కష్టపడి ఎంఏ పూర్తి చేశారు. ద‌క్షిణాది భాష‌ల్లో న‌టించ‌మే కాదు.. మీనా ఆ భాష‌ల్లో మాట్లాడ‌గ‌ల‌రు కూడా. 

ఓ బ‌ర్త్ డే పార్టీలో మీనా (Meena) ను చూసిన నటుడు శివాజీ గణేషన్, త‌న సినిమాలో బాల న‌టిగా న‌టించే అవ‌కాశం క‌ల్పించారు.

2009లో  మీనా (Meena) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప‌. పేరు నైనిక‌. నైనిక కూడా త‌ల్లి మీనాలా బాల న‌టిగా ప‌లు సినిమాల్లో న‌టిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా మీనా భ‌ర్త ఇటీవ‌లే మ‌ర‌ణించారు.  మీనా పెళ్లయ్యాక కూడా క్యారెక్ట‌ర్ ఆరిస్టుగా మంచి పాత్ర‌ల్లో న‌టిస్తూ ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతున్నారు. దృశ్యం, అన్నాతే, బ్రో డాడీ, షైలాక్ లాంటి సినిమాలలో మీనా తన పెళ్లయ్యాకే నటించారు. 

Read More: విద్యాసాగర్ మరణం పై వస్తున్న పుకార్లపై స్పందించిన మీనా (Meena) ! తన భర్త మృతిని వివాదాస్పదం చేయవద్దని అభ్యర్థన

ఓ బ‌ర్త్ డే పార్టీలో మీనా (Meena) ను చూసిన నటుడు శివాజీ గణేషన్, త‌న సినిమాలో బాల న‌టిగా న‌టించే అవ‌కాశం క‌ల్పించారు.

బాల న‌టిగా, హీరోయిన్‌గా ప‌లు సినిమాల్లో  న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సులో ఒక ప్ర‌త్యేక స్థానాన్ని పొందిన మీనా.. మ‌రిన్ని సినిమాల‌తో తన అభిమానులకు వినోదం పంచాల‌ని పింక్ విల్లా కోరుకుంటుంది.  హ్యాపీ బ‌ర్త్ డే మీనా.
పింక్ విల్లా
 
ఓ బ‌ర్త్ డే పార్టీలో మీనా (Meena) ను చూసిన నటుడు శివాజీ గణేషన్, త‌న సినిమాలో బాల న‌టిగా న‌టించే అవ‌కాశం క‌ల్పించారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!