హీరోయిన్ మీనా (Meena) భ‌ర్త ఆకస్మిక మ‌ర‌ణం.. క‌రోనా కార‌ణంగా మృతి

Updated on Jun 29, 2022 12:55 PM IST
మీనా (Meena) భ‌ర్త మృతితో సినిమా ప‌రిశ్ర‌మ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 
మీనా (Meena) భ‌ర్త మృతితో సినిమా ప‌రిశ్ర‌మ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

ప్రముఖ హీరోయిన్ మీనా (Meena) ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ మంగ‌ళ‌వారం రాత్రి క‌న్నుమూశారు. ఇటీవ‌ల మీనా కుటుంబం క‌రోనా బారిన ప‌డింది. అప్ప‌టి నుంచి మీనా భ‌ర్త కోలుకోలేదు. చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌లో మీనా భ‌ర్త‌ మ‌ర‌ణించారు. మీనా భ‌ర్త మృతితో సినిమా ప‌రిశ్ర‌మ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ప‌లు చిత్రాల్లో మీనా (Meena) న‌టించారు. మీనా 2009లో వివాహం విద్యాసాగ‌ర్‌ చేసుకున్నారు. విద్యాసాగ‌ర్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ప‌నిచేస్తున్నారు. మీనా, విద్యాసాగర్‌ల వివాహం జూలై 12న చెన్నైలోని ఆర్య సమాజ్ కల్యాణ మండపంలో జ‌రిగింది. 

ఉపిరితిత్తుల స‌మ‌స్య‌తో మృతి
మీనా (Meena) కుటుంబం జనవరిలో కోవిడ్ బారిన‌ ప‌డింది. క‌రోనా త‌ర్వాత మీనా భ‌ర్త కోలుకోలేదు. లివర్ ఇన్‌ఫెక్షన్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. కొద్ది రోజుల క్రితం విద్యాసాగ‌ర్ ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల‌ని డాక్ట‌ర్లు చెప్పారు. 

బ్రెయిన్ డెడ్ వ్య‌క్తి దొరికితే ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ స‌ర్జ‌రీ చేస్తామ‌ని వైద్యులు తెలిపారు. అలాంటి వ్య‌క్తి కోసం ఎదురుచూస్తున్న స‌మ‌యంలో విద్యా సాగ‌ర్ ఆరోగ్యం విష‌మించింది. దీంతో జూన్ 28న విద్యాసాగ‌ర్ క‌నుమూశారు. మీనా త‌న భ‌ర్త మ‌ర‌ణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. విద్యాసాగర్ అంత్యక్రియలు జూన్ 29 న‌ చెన్నైలో నిర్వ‌హించ‌నున్నారు. 

Read More: R. Madhavan: ఆర్. మాధవన్ నటించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ చిత్రంపై సీబీఐ అధికారుల ప్రశంసలు..!

మీనా (Meena) భ‌ర్త మృతితో సినిమా ప‌రిశ్ర‌మ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!