Samantha: స‌మంత ఎవ‌రిని క‌లిసేందుకు దుబాయ్ వెళ్లారో తెలుసా!

Updated on Jun 28, 2022 06:39 PM IST
Samantha: దుబాయ్‌లో ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డితో పాటు ఆమె చెల్లెలితో క‌లిసి ఎంజాయ్ చేస్తున్న స‌మంత‌.
Samantha: దుబాయ్‌లో ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డితో పాటు ఆమె చెల్లెలితో క‌లిసి ఎంజాయ్ చేస్తున్న స‌మంత‌.

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా స‌మంత (Samantha) కొన‌సాగుతున్నారు. అటు కోలీవుడ్ సినిమాల్లో కూడా న‌టిస్తూ సామ్ త‌న ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. స‌మంత తాను న‌టించిన‌ ఐట‌మ్ సాంగ్ 'ఉ అంటావా మామ'తో నార్త్‌లోనూ ఫేమ‌స్ అయ్యారు. సామ్ నార్త్‌లో కూడా త‌న యాక్టింగ్ ప‌వ‌ర్ ఏంటో చూపించేందుకు రెడీ అవుతున్నారు. స‌ల్మాన్ ఖాన్‌తో ఓ సినిమాలో న‌టించ‌నున్నార‌నే టాక్ కూడా వినిపిస్తుంది. ప్ర‌స్తుతం సామ్ దుబాయ్ టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. 

స‌మంత క్ష‌ణం తీర‌క లేకుండా (Samantha) షూటింగ్స్‌లో బిజీ బిజీగా ఉంటున్నారు. ఓ వైపు సినిమాలు.. మ‌రో వైపు యాడ్స్‌లో న‌టిస్తున్నారు. అంతేకాకుండా టాప్  బ్రాండ్‌ల‌కు త‌నదైన స్టైల్‌లో ఫోటోల‌కు ఫోజులు ఇస్తున్నారు. 

స‌మంత (Samantha) షూటింగ్‌ల‌కు గ్యాప్ దొరికితే చాలు ఫ్రెండ్స్‌తో విహార‌యాత్ర‌లుకు వెళుతుంటారు. ఈ చెన్నై బ్యూటీ తాజాగా దుబాయ్‌కు వెళ్లారు. త‌న స్నేహితురాలు, ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డితో క‌లిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోల‌ను శిల్పారెడ్డి త‌న ఇన్ స్టాలో షేర్ చేశారు. 

 

Samantha: దుబాయ్‌లో ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డితో పాటు ఆమె చెల్లిలితో క‌లిసి ఎంజాయ్ చేస్తున్న స‌మంత‌.

శిల్పారెడ్డి చెల్లి కోసం దుబాయ్‌కు సామ్!

శిల్పారెడ్డి, స‌మంతలు బెస్ట్ ఫ్రెండ్స్. శిల్పారెడ్డికి ఓ చెల్లి ఉంది. ఆమె పేరు సాహిత్య రెడ్డి. దుబాయ్‌లో  శిల్పారెడ్డితో సమంత తెగ ఎంజాయ్ చేస్తున్నారు. శిల్పారెడ్డి త‌న‌ కుమారుడు కోసం దుబాయ్ ట్రిప్‌కు వెళ్లారు.

అక్క‌డికి వెళ్లే క్రమంలో త‌న చెల్లెలు, స్నేహితురాలు సామ్‌ను కూడా ఆహ్మానించారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డితో క‌లిసి సామ్ దుబాయ్‌లో హ‌ల్ చ‌ల్ చేశారు. 

త‌న చెల్లెలు, స‌మంత ఫైన‌ల్‌గా క‌లుసుకున్నారంటూ శిల్పారెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సామ్, సాహిత్యలు క‌ల‌వ‌డం అద్బుతమ‌ని.. వీరిద్ద‌రూ త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన మ‌హిళ‌ల‌న్నారు. త‌న కుమారుడు దేవా 'సామ్ ఆంటీ'ని క‌లుసుకోవ‌డం ఎంతో స‌ర‌దాగా ఉంటుంద‌న్నారు శిల్పారెడ్డి. 

హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సామ్

స‌మంత (Samantha) ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో 'ఖుషీ' సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాణ తెర‌కెక్కిస్తున్నారు. గుణ‌శేఖ‌ర్ డైరెక్ష‌న్‌లో 'శాకుంత‌లం'లో లీడ్ రోల్ చేస్తున్నారు స‌మంత‌. య‌శోద చిత్రంలో కూడా సామ్ న‌టిస్తున్నారు. 

స‌మంత బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తున్నార‌ట‌. స‌ల్మాన్ ఖాన్‌తో ఓ సినిమాలో న‌టిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్... ఇలా సామ్ హాలీవుడ్ ప్రాజెక్టుల‌పై కూడా ఫోక‌స్ పెట్టారు. హాలీవుడ్‌లో 'ఎరైంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్' అనే సినిమాలో స‌మంత న‌టించ‌నున్నారు. 

Read More: నాగ చైతన్యతో 'శోభిత ధూళిపాళ‌' డేటింగ్‌ ! అయితే స‌మంత (Samantha) కు ఎందుకంత కోపం ?

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!