Samantha: హాలీవుడ్‌లోనూ సత్తా చాటడానికి రెడీ అవుతున్న సమంత.. ఫ్యాన్స్‌కు సమాధానం చెప్పడం నా బాధ్యత

Updated on Jun 26, 2022 12:49 PM IST
సమంతా రుత్ ప్రభు
సమంతా రుత్ ప్రభు

‘ఏ మాయ చేసావే’ ‘సినిమాతో అందరినీ మాయ చేసిన సమంతా రుత్ ప్రభు (Samantha) అప్పటి నుంచి టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో స్క్రీన్‌ షేర్ చేసుకున్న ఈ భామ.. తక్కువ సమయంలోనే నంబర్ వన్‌ హీరోయిన్‌ స్థానానికి చేరుకుంది. టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లో కూడా మంచి సినిమాలు చేస్తున్న సమంత.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన సత్తా చూపించడానికి రెడీ అవుతోంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా ఖాళీ లేకుండా వెబ్‌ సిరీస్‌ల్లో నటించి, ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయిన పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది ఈ అమ్మడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకుని అక్కడ కూడా తన టాలెంట్ చూపిస్తానంటోన్న సమంత పంచుకున్న విశేషాలు మీ కోసం..

విమర్శలనూ ఎదుర్కొన్నా..

ఒకే రకమైన పాత్రలు చేయడం అంతగా నచ్చదు. కథలో కొత్తదనం, పాత్రలో భిన్నమైన కోణాలు ఉండాలి. రెండేళ్లపాటు వైవిధ్యమైన పాత్రల కోసం ఎదురు చూశాను. సరిగ్గా అప్పుడే ‘ఫ్యామిలీ మ్యాన్‌2’లో నటించే అవకాశం వచ్చింది. వెంటనే అంగీకరించాను. ఆ క్యారెక్టర్ చేసినందుకు చాలా మంది ప్రశంసించారు. అదే సమయంలో విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఒక స్త్రీ బాధ కోపమైతే ఎలా ఉంటుందని చూపించే పాత్రలో నటించడం సంతృప్తినిచ్చింది.

సమంతా రుత్ ప్రభు

మహాభారతం చదివిన తరువాతే..

మనసుకి ప్రశాంతత కావాలని అనిపించిన వెంటనే హిమాలయాలు గుర్తొస్తాయి. ‘మహాభారతం’ చదివిన తరువాతే ఆధ్యాత్మిక యాత్రలపై ఆసక్తి కలిగింది. చార్‌ధామ్‌ వెళ్లి వచ్చాను. సరైన సమయంలో, సరైన వ్యక్తులతో, సరైన ప్రదేశాలకు వెళ్లడం అవసరం. ప్రతి వ్యక్తి చనిపోయేలోపు ఒక్కసారైనా చూడాల్సిన అద్భుత ప్రదేశం హిమాలయాలు.

కొత్తగా ప్రయత్నించాలంటే కష్టపడాల్సిందే..

విభిన్నంగా ఏదైనా ప్రయత్నించాలని అనుకుంటే మాత్రం కష్టపడక తప్పదు. భిన్నమైన కథలను సెలక్ట్‌ చేసుకున్నప్పుడు అందులోని ఉన్న ప్రతి అంశానికి న్యాయం చేయగలగాలి. అప్పుడే దర్శకుడు అనుకున్న కథ తెరపై కనిపిస్తుంది. ‘ఫ్యామిలీ మ్యాన్‌2’లో రాజీ అనే క్యారెక్టర్‌‌ చాలా కష్టాలు, ఒడిదుడుకులను తట్టుకుని నిలబడుతుంది. ఆ పాత్రలోని కోపం, కష్టాన్ని ఫీలై నటించాను. దానికి అనుగుణంగా ఐటెం సాంగ్‌ కూడా చేయాల్సి వచ్చింది. ‘పుష్ప’లో ‘ఊ అంటావా..’ సాంగ్‌ను కూడా ఒక చాలెంజ్‌గానే తీసుకుని చేశాను.

ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ పోస్టర్

కొన్ని యూట్యూబ్‌ చానల్సే..

సోషల్‌ మీడియాలో నాకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకోవడం, వాటిపై అభిమానుల అభిప్రాయాలు తెలుసుకోవడం, వాళ్ల ప్రశ్నలకు సమాధానాలివ్వడం ఇబ్బందిగా అనిపించలేదు. నాకు నేనుగా వాళ్లను నా జీవితంలోకి పిలిచిన తర్వాత వాళ్లు అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. నా సమస్యంతా కొన్ని యూట్యూబ్‌ చానళ్ల వలనే. వాళ్ల వ్యూస్‌ కోసం ఇష్టమొచ్చినట్టు ఊహించి రాసేస్తారు. వ్యక్తిగత, వృత్తిగత విషయాలు అనే భేదం లేకుండా ఏది తోస్తే అది రాసేసి ఇబ్బందిపెడుతున్నారు.

నన్ను నేను మార్చుకున్నాను..

ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. నా మొదటి సినిమా హిట్‌ కావడంతో జాక్‌పాట్‌ కొట్టేశాననుకున్నారు చాలామంది. నేను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మొదటి సినిమా చూసి స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగాలేదని అనుకున్నాను. దాంతో స్క్రీన్‌పై బాగా కనిపించేలా నన్ను నేను మార్చుకున్నాను. ఆత్మన్యూనతా భావంతో క్రుంగిపోయే వారికి చేయూతనిచ్చి వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నిస్తున్నాను.

ఫిలిప్ జాన్‌తో కలిసి పనిచేయడం..

తాజాగా చూసిన షో ‘మేయర్‌ ఆఫ్‌ కింగ్స్‌టౌన్‌'. నాకు బాగా ఇష్టమైన షోలు ‘డౌన్‌టౌన్‌ అబ్బే’,  ‘బ్రిడ్జర్‌టన్‌', ‘మోడ్రన్‌ లవ్‌'. నా తదుపరి ప్రాజెక్ట్‌ ‘అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌'కి డైరెక్టర్‌ ఫిలిప్‌ జాన్‌. ఆయన దర్శకత్వంలో నటించడం నిజంగా ఓ అద్భుతంగా భావిస్తున్నా అని చెప్పింది సమంత (Samantha)

Read More : బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సమంత (Samantha).. ఏకంగా సల్మాన్‌కు జోడీగా ఆఫర్ కొట్టేసిన సామ్‌?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!