నాగ చైతన్యతో 'శోభిత ధూళిపాళ‌' డేటింగ్‌ ! అయితే స‌మంత (Samantha) కు ఎందుకంత కోపం ?

Updated on Jun 21, 2022 08:46 PM IST
స‌మంత (Samantha) పీఆర్ టీమ్‌పై నాగ‌చైత‌న్య ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. నాగ‌చైత‌న్య‌, శోభిత ధూళిపాళ డేటింగ్ న్యూస్ వెనుక స‌మంత పీఆర్ టీమ్ హ‌స్తం ఉందంటున్నారు.
స‌మంత (Samantha) పీఆర్ టీమ్‌పై నాగ‌చైత‌న్య ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. నాగ‌చైత‌న్య‌, శోభిత ధూళిపాళ డేటింగ్ న్యూస్ వెనుక స‌మంత పీఆర్ టీమ్ హ‌స్తం ఉందంటున్నారు.

నాగ చైత‌న్య‌, శోభిత ధూళిపాళ‌ స‌హ‌జీవనం చేస్తున్నారనే వార్త‌పై స‌మంత (Samantha)  త‌న‌దైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. మాజీ భ‌ర్త డేటింగ్‌పై వ‌చ్చిన వార్త‌ల‌పై సామ్ ఫైర్ అయ్యారు.

ఇదే క్రమంలో స‌మంత త‌న పీఆర్ టీమ్‌పై వార్త‌లు రాసిన వారికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. అంతే కాకుండా 'అబ్బాయిలు.. ఇక నైనా ఎద‌గండి' అంటూ ప‌రోక్షంగా ఇంకెవ‌రికో సెటైర్లు విసిరారు. 'శోభిత‌, చై'ల డేటింగ్ వ్య‌వ‌హారంపై స‌మంత చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. 

చై ఫ్యాన్స్‌పై స‌మంత ఫైర్
స‌మంత (Samantha) పీఆర్ టీమ్‌పై నాగ‌చైత‌న్య ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. నాగ‌చైత‌న్య‌, శోభిత ధూళిపాళ డేటింగ్ న్యూస్ వెనుక స‌మంత పీఆర్ టీమ్ హ‌స్తం ఉందంటున్నారు.

నాగ చైత‌న్య‌పై లేనిపోని పుకార్లు ప్ర‌చారం చేస్తున్నార‌ని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే నాగ చైత‌న్య ఫ్యాన్స్‌కు స‌మంత స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ట్వీట్ చేశారు. అస‌లు స‌మంత ఏమ‌ని ట్వీట్ చేశారంటే..

 
 
అమ్మాయిల‌పై ఏదైనా వార్త వ‌స్తే అది నిజ‌మైపోతుంది. కానీ అబ్బాయిల‌పై జ‌రిగే ప్ర‌చారాల‌కు అమ్మాయిలే కార‌ణ‌మంటారు. అబ్బాయిలు కాస్త ఎద‌గండి. ముందుకు సాగండి. అబ్బాయిలు.. మీరు చేసే ప‌ని మీద‌.. మీ కుటుంబంపైన దృష్టి పెట్టండి.
స‌మంత‌
 

ఆవేశంతో ఊగిపోయిన సమంత
స‌మంత (Samantha) సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్ర‌తీ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంటారు. అప్పుడ‌ప్పుడు వ్య‌క్తిగ‌త వివ‌రాల‌కు సంబంధించి త‌న ఫీలింగ్స్ కూడా బ‌య‌ట‌పెడుతుంటారు. 

చై, సామ్ విడిపోయిన త‌ర్వాత వీరిద్ద‌రి పీఆర్ టీమ్‌లు.. ఒక‌రిపై ఒక‌రు ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేస్తున్నారంటూ ఓ వెబ్‌సైట్ క‌థనాన్ని రాసింది. ఆ వార్త‌లో చైత‌న్య‌పై స‌మంత టీమ్ విష ప్ర‌చారం చేస్తుంద‌ని రాసింది.

ఆ న్యూస్ చూసిన స‌మంత ఆవేశంతో ఊగిపోయారు. త‌న టీమ్‌ను కించ‌ప‌రిచిన వారికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. ఇక ప‌నిలో ప‌ని నాగ‌చైత‌న్య ఫ్యాన్స్‌కు కూడా వార్నింగ్ ఇచ్చారు.  

స‌మంత ట్వీట్ వైర‌ల్
స‌మంత (Samantha) కూడా గ‌తంలో చాలా రూమ‌ర్లను ఎదుర్కొన్నారు. ఆమె ఓ ఫ్యాష‌న్ డిజైన‌ర్‌తో డేటింగ్‌లో ఉంద‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అలాగే స‌మంత పిల్ల‌లు వ‌ద్దనుకోవ‌డం వ‌ల్లే, నాగ‌చైత‌న్య‌తో విడాకుల తీసుకుంద‌ని మ‌రో వార్త హ‌ల్ చ‌ల్ చేసింది. అదే విధంగా,  సినిమాల్లో శృతిమించి అందాల ఆర‌బోత కూడా ఓ కార‌ణం అనే టాక్ న‌డిచింది. 

వీరిద్ద‌రి మ‌ధ్య విడాకుల కార‌ణాలు ఎలా ఉన్నా.. నాగ చైత‌న్య‌పై వ‌చ్చిన న్యూస్‌పై స‌మంత స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం స‌మంత ట్వీట్ సోష‌ల్ మీడియాలోనే కాకుండా, సినీ వర్గాలు కూడా చ‌ర్చించుకునేలా చేస్తోంది. నాగ చైత‌న్య ఫ్యాన్స్‌కు మొద‌టి సారి డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చిన స‌మంతపై చై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

Read More: Naga Chaitanya (నాగ చైతన్య) : యూత్ సత్తాని చాటి చెప్పిన .. 'థాంక్యూ' సినిమాలోని 'మారో మారో' సాంగ్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!