ర‌జ‌నీకాంత్ (Rajnikanth), ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ (Aishwarya Rai Bachchan) కాంబో సినిమాకు లైన్ క్లియ‌ర్‌!

Updated on Jun 08, 2022 08:08 PM IST
ర‌జ‌నీ (Rajnikanth), ఐశ్వ‌ర్య కాంబినేష‌న్ వెండితెర‌పై మ‌రోసారి మురిపించ‌నుంది. 
ర‌జ‌నీ (Rajnikanth), ఐశ్వ‌ర్య కాంబినేష‌న్ వెండితెర‌పై మ‌రోసారి మురిపించ‌నుంది. 

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajnikanth) సినిమాల‌కు ఉన్న క్రేజే వేరు.  ర‌జ‌నీ సినిమాల‌కు దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా మంచి ఆద‌ర‌ణ ఉంది.  ఇటీవలే ర‌జ‌నీకాంత్ తన 169 వ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  తాజా సమాచారం ప్రకారం, జూలై నుంచి ర‌జ‌నీకాంత్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇక ర‌జ‌నీ 169వ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వ‌ర్య‌రాయ్ న‌టిస్తున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఆ విష‌య‌మే గనుక నిజ‌మైతే ర‌జ‌నీ, ఐశ్వ‌ర్యల జంట‌.. 'రోబో' తర్వాత సినీ వెండితెర‌పై మ‌రోసారి ఫ్యాన్స్‌ను మురిపించే అవకాశం ఉంది.  

రోబోలో ఇద్ద‌రి న‌ట‌న అదుర్స్
శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 2010లో వ‌చ్చిన 'రోబో' సినిమాలో ర‌జ‌నీకాంత్‌కు జోడిగా ఐశ్వ‌ర్య‌రాయ్ న‌టించారు. అప్ప‌ట్లో రూ. 132 కోట్ల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన‌ 'రోబో' సినిమా అప్ప‌ట్లో భారీ హిట్ కొట్టింది. ఆ త‌ర్వాత లైకా ప్రొడ‌క్ష‌న్ నిర్మాణంలో రోబో 2.0ను రోబోకు సీక్వెల్‌గా నిర్మించారు.

రోబో 2.0 చిత్రానికి రూ. 570 కోట్లు ఖ‌ర్చు చేశారు. రోబో 2.0 లో కూడా ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న ఐశ్వ‌ర్య‌రాయే న‌టించారు. రోబో 2.0 బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమా రూ. 800 కోట్లు, రాబ‌ట్టి రికార్డు సృష్టించింది. ర‌జ‌నీ, ఐశ్వ‌ర్య కాంబో అంటేనే ప్రేక్ష‌కులు వావ్ అంటున్నారు. ఇక వీరిద్ద‌రూ క‌లిసి త‌లైవా (Rajnikanth) 169వ చిత్రంలో న‌టిస్తున్నారంటే, అది ఫ్యాన్స్‌కు కచ్చితంగా కిక్ ఇచ్చే వార్తే. 

ర‌జ‌నీకాంత్ (Rajnikanth) సినిమాలో ఐశ్వ‌ర్యరాయ్ న‌టించ‌డం లేదంటూ ముందు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇటీవలే త‌లైవా 169 మేక‌ర్స్ ఓ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్య‌రాయ్, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌తో న‌టిస్తున్నారంటూ ప్ర‌క‌టించారు. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్, ఏజీఎస్ స్టూడియోస్ క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 2023లో ర‌జ‌నీకాంత్ (Rajnikanth) న‌టించ‌బోయే 169వ సినిమా రిలీజ్ కానుంది.

ర‌మ్య‌కృష్ణకు కీల‌క పాత్ర‌
ఐశ్వ‌ర్య‌రాయ్ ఈ మ‌ధ్య ప్ర‌పంచ సినిమా వేడుకైన కేన్స్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్‌లో మెరిశారు. ఆ త‌ర్వాత ఐఫా అవార్డ్స్ వేడుక‌ల్లో కూడా క‌నిపించారు. భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్, కూతురు ఆరాధ్య‌తో క‌లిసి, ఆ వేడుక‌లో ఆమె సంద‌డి చేశారు. ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ బచ్చన్ మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుద‌ల కానుంది. 

ఇక 70 ఏళ్ల ర‌జ‌నీకాంత్ (Rajnikanth) సతీమణి పాత్ర‌లో, 48 ఏళ్ల ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు. ర‌మ్య‌కృష్ణ కూడా ఓ స్సెష‌ల్ పాత్ర‌లో న‌టిస్తార‌ట‌. 2023లో ర‌జ‌నీకాంత్ న‌టించ‌బోయే 169వ సినిమా రిలీజ్ కానుంది.  

Read more : ర‌జనీకాంత్ (Rajinikanth) తన కొత్త సినిమా రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లు పెంచారో తెలుసా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!