రజినీకాంత్ (Rajinikanth) చంద్రముఖి సినిమా సీక్వెల్ ప్రకటించనున్న లైకా ప్రొడక్షన్స్?

Updated on Jun 14, 2022 11:03 PM IST
చంద్రముఖి పోస్టర్, రాఘవ లారెన్స్, రజినీకాంత్ (Rajinikanth)
చంద్రముఖి పోస్టర్, రాఘవ లారెన్స్, రజినీకాంత్ (Rajinikanth)

సూప‌ర్‌‌స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth), పి.వాసు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన బ్లాక్ బస్టర్‌‌ సినిమా చంద్రముఖి. 17 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ సినిమా అప్పట్లో ఆల్‌ టైమ్‌ హిట్‌గా నిలిచింది. అప్పట్లోనే దానికి సీక్వెల్ రాబోతోందని టాక్ నడిచింది.

అయితే ఇన్ని సంవత్సరాలుగా దాని గురించి ఎటువంటి అప్‌డేట్‌ బయటకు రాలేదు. తాజాగా చంద్రముఖి సీక్వెల్‌పై ఒక వార్త ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

చంద్రముఖి సినిమాకు ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్‌ సీక్వెల్‌ చేయబోతున్నట్టు టాక్. త్వరలోనే దానిపై ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయబోతున్నట్టు కంపెనీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టింది. రేపు సాయంత్రం దీనిపై అప్‌డేట్‌ రానుంది.

అప్పటి వరకు వేచి ఉంటే.. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ప్రకటించబోయే ప్రాజెక్ట్‌ చంద్రముఖి 2 సినిమాకు సంబంధించినదా లేక వేరే ప్రాజెక్టా అనే విషయంపై స్పష్టత రానుంది.

లైకా ప్రొడక్షన్స్‌ చేసిన ట్వీట్

వాసు డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నా: రాఘవ లారెన్స్

ఇక, చంద్రముఖి ఫస్ట్ పార్ట్‌ తెరకెక్కించిన పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి 2 సినిమా చేయబోతున్నట్టు 2020లోనే డ్యాన్స్‌ మాస్టర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ ప్రకటించాడు.

ఈ రీమేక్‌లో హీరోయిన్‌ లీడ్‌ రోల్‌ చేయబోతున్నట్టు టాక్. ఇక, ఇటీవల పెళ్లి చేసుకున్న కేరళ కుట్టి నయనతార టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది చంద్రముఖి సినిమాతోనే కావడం విశేషం.

చంద్రముఖి సినిమాలో రజినీకాంత్ (Rajinikanth), ప్రభు, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించారు. హారర్ మూవీల్లో ట్రెండ్ సెట్‌ చేసిన చంద్రముఖి.. రజినీకాంత్ కెరీర్‌‌లో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు.

అలాగే చంద్రముఖి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నయనతార టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

Read More: నయనతార నటనా ప్రతిభను చాటిన.. టాప్ 10 చిత్రాలు మీకోసం ప్రత్యేకం ! 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!