Sita Ramam: 'సీతారామం' సినిమా క‌లెక్ష‌న్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. గుడ్ ల‌వ్ స్టోరి అంటున్న ప్రేక్ష‌కులు

Updated on Aug 24, 2022 06:25 PM IST
Sita Ramam:  'సీతారామం' విడుద‌లై 19 రోజులు కావ‌స్తున్నా.. క‌లెక్ష‌న్ల హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.  ఓ మంచి ప్రేమ‌క‌థా చిత్రం చూశామ‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 
Sita Ramam: 'సీతారామం' విడుద‌లై 19 రోజులు కావ‌స్తున్నా.. క‌లెక్ష‌న్ల హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఓ మంచి ప్రేమ‌క‌థా చిత్రం చూశామ‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

Sita Ramam: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman)  హీరోగా నటించిన 'సీతారామం' సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొడుతోంది. రోజు రోజుకు క‌లెక్ష‌న్ పెరుగుతూ వ‌స్తుంది. 'సీతారామం' విడుద‌లై 19 రోజులు కావ‌స్తున్నా.. క‌లెక్ష‌న్ల హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. చాలా రోజుల త‌రువాత ఓ మంచి ప్రేమ‌క‌థా చిత్రం చూశామ‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వంలో 'సీతారామం' (Sita Ramam)  సినిమా ఆగ‌స్టు 5 తేదీన విడుద‌లైంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జంట‌గా మృణాల్ ఠాకూర్ న‌టించారు. హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న, సుమంత్, తరుణ్ భాస్కర్ కీలక పాత్ర‌ల్లో క‌నిపించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో అశ్వనీదత్ నిర్మాతగా స్వప్న సినిమా పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. 19 రోజుల్లో 'సీతారామం' తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. 

'సీతా రామం' బాక్సాఫీస్ కలెక్షన్ వివ‌రాలు

  •  నైజాం - రూ. 7.86 కోట్లు
  •  సీడెడ్ - రూ. 1.69 కోట్లు
  • ఉత్తరాంధ్ర - రూ. 2.93 కోట్లు
  • ఈస్ట్ గోదావరి - రూ. 1.65 కోట్లు
  • వెస్ట్ గోదావరి - రూ. 1.09 కోట్లు
  •  గుంటూరు - రూ. 1.32 కోట్లు
  •  కృష్ణా - రూ. 1.51 కోట్లు
  •  నెల్లూరు - రూ. 73 లక్షలతో 

'సీతారామం' సినిమా ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క‌లిపి రూ.18.78 కోట్లు షేర్ వ‌సూళ్లు చేసింది. మొత్తం రూ. 33.30 కోట్లు గ్రాస్ రాబ‌ట్టింది. ఇక ఇండియాలో 2.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.25 కోట్లు, ఇత‌ర‌ భాషల్లో రూ. 6.60 కోట్లు వసూలు చేసింది.  19 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 33.88 కోట్లు షేర్‌‌తో పాటు రూ. 67.40 కోట్లు గ్రాస్‌ను రాబ‌ట్టింది. 

Read More: చూడ చ‌క్క‌ని దృశ్య కావ్యం 'సీతారామం' (Sita Ramam) - మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!