చూడ చక్కని దృశ్య కావ్యం 'సీతారామం' (Sita Ramam) - మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
'సీతారామం' (Sita Ramam) సినిమాపై మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు (M. Venkaiah Naidu) ప్రశంసలు కురిపించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన 'సీతారామం' సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. దుల్కర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'సీతారామం' సినిమాపై మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు రివ్యూ ఇచ్చారు.
చిత్ర యూనిట్‌కు అభినందనలు - వెంకయ్య
'సీతారామం' (Sita Ramam) చిత్రం విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో థియేటర్లను షేక్ చేస్తుంది. ఎన్నో భావోద్వేగాలను దర్శకుడు హను రాఘవపూడి గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమా వీక్షించిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తన ట్విట్టర్‌లో చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతిని "సీతారామం" అందించిందన్నారు. రణగొణధ్వనులు లేకుండా, కళ్ళకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత అశ్వినీదత్‌లకు అభినందనలంటూ ట్వీట్ చేశారు వెంకయ్య.
తాను 'సీతారామం' (Sita Ramam) సినిమా వీక్షించానని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ సినిమాలో నటీనటుల అభినయం, సాంకేతిక విభాగం పనితీరుతో చక్కని దృశ్యకావ్యం 'సీతారామం' ఆవిష్కృతమైందన్నారు. సాధారణ ప్రేమ కథలా కాకుండా.. వీర సైనికుని నేపథ్యంలో.. అనేక భావోద్వేగాలను ఆవిష్కరించారన్నారు. 'సీతారామం' చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగిన సినిమా అని వెంకయ్య నాయుడు తెలిపారు.
Read More: Sita Ramam: దర్శకుడిని చూసి భావోద్వేగానికి గురైన 'సీతారామం' హీరోయిన్ (Mrunal Thakur)