Sitaramam Movie Review: మనసుకు హత్తుకునే కథ ‘సీతారామం’ .. దుల్కర్, మృణాల్‌ల కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా !
సినిమా : సీతారామం
కథ: హను రాఘవపూడి, రాజ్‌కుమార్ కందమూడి
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
నిర్మాతలు : వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్
దర్శకత్వం : హను రాఘవపూడి
విడుదల తేదీ : 05 ఆగస్టు 2022
రేటింగ్ : 3.5 / 5
'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman). ఆ తర్వాత ఆయన ఏ తెలుగు చిత్రమూ చేయలేదు. చాలా కాలం తర్వాత ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మళ్లీ పలకరించారు దుల్కర్. 'సీతారామం' సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు.
అలాగే ఈ చిత్రంలో రష్మికా మందానతో పాటు సుమంత్ కూడా కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్‌పై అశ్వినీదత్ 'సీతారామం' సినిమాను నిర్మించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లతో పాటు ట్రైలర్, ఈ ప్రాజెక్టుపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి.
ఇటీవలే ఈ చిత్ర ప్రమోషన్స్‌ను కూడా గ్రాండ్‌గా నిర్వహించింది చిత్ర యూనిట్. భారీ అంచనాల మధ్య ఆగస్టు 5వ తేదీన సీతారామం సినిమా విడుదలైంది.
కథ ఎలా ఉందంటే?
రామ్ (దుల్కర్ సల్మాన్) అనే సైనికుడు యుద్ధ సమయంలో పాకిస్తాన్ నుండి భారతదేశానికి ఓ ఉత్తరం రాస్తాడు. సీతామహాలక్ష్మి అనే ఓ అమ్మాయికి చేరాల్సిన ఉత్తరం అది. కానీ అనుకోని సంఘటనల వల్ల ఆ లేఖ చేరదు. కొన్ని సంవత్సరాల తర్వాత, ఆ లేఖను సంబంధిత వ్యక్తికి చేర్చాల్సిన బాధ్యత అఫ్రిన్ (రష్మిక) మీద పడుతుంది. అసలు ఆ లేఖ వెనుక ఉన్న కథేమిటి? ఆ కథలో అంతర్లీనంగా సాగే మరో ప్రేమకథ ఏమిటి? అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
సీతారామం సినిమా ఫస్టాప్‌లో వచ్చే లవ్ సీన్స్, పాటలు బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లేతో దర్శకుడు మెస్మరైజ్ చేశాడు. క్లైమాక్స్ కూడా బాగుంది. ఊహించని విధంగా ఉంది. ఇక కథానాయకుడు దుల్కర్, హీరోయిన్ మృణాల్‌ల కెమిస్ట్రీ బాగుంది. ఫస్టాఫ్‌లో ప్రేమ సన్నివేశాలు, ఉత్తరాలతో నడిచే సీన్లతో కథ కొంచెం నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించినా... సంగీతం మాత్రం మనసును ఆహ్లాదపరుస్తుంది. ఇక సెకండాఫ్ కథ స్పీడ్‌గా సాగడంతో బోర్ కొట్టే చాన్స్ ఉండదు.
రామ్ క్యారెక్టర్‌లో దుల్కర్ ఒదిగిపోయారు. రష్మికా మందానతో పాటు నటుడు సుమంత్ తమ తమ క్యారెక్టర్లకు పూర్తిగా న్యాయం చేశారు. ముస్లిం యువతిగా రష్మిక నటన ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాలోని పాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తన టాలెంట్‌తో ప్రేక్షకులకు మాయ చేశారని చెప్పవచ్చు. ఆయన పై నెటిజన్లు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలోని మరో సానుకూల అంశం విజువల్స్. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.
చివరిగా.. సీతారామం సినిమా ఒక క్లాసిక్ రొమాంటిక్ డ్రామా