Sita Ramam: 'సీతారామం' ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్.. దుల్కర్, రష్మిక (Rashmika Mandanna) పాత్ర‌లే క‌థ‌కు బ‌ల‌మ‌ట‌!

Updated on Jul 24, 2022 11:44 AM IST
Rashmika Mandanna: 'సీతారామం' చిత్ర ట్రైల‌ర్‌ను జూలై 25 న విడుద‌ల చేస్తామంటూ ఓ స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేశారు.  
Rashmika Mandanna: 'సీతారామం' చిత్ర ట్రైల‌ర్‌ను జూలై 25 న విడుద‌ల చేస్తామంటూ ఓ స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేశారు.  

Sita Ramam: 'సీతారామం' చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ వెరైటీగా ప్ర‌క‌టించింది. ఈ సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్, ర‌ష్మిక మందన్న‌ (Rashmika Mandanna) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో 'సీతారామం' తెర‌కెక్కింది. వైజయంతి మూవీస్‌ సమర్పణలో, స్వప్న సినిమాస్‌ పతాకంపై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

స్పెష‌ల్ వీడియో రిలీజ్
'సీతారామం' (Sita Ramam) సినిమా ఆగ‌స్టు 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. చిత్ర యూనిట్ ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌ను మ‌రింత పెంచింది. దుల్క‌ర్ స‌ల్మాన్ ఫ‌స్ట్ లుక్‌ను మొద‌ట రిలీజ్ చేసింది. ఆ త‌ర్వాత టాలీవుడ్ హీరో సుమంత్, ర‌ష్మిక‌, ముర‌ళీశ‌ర్మ, వెన్నెల కిషోర్ పాత్ర‌ల ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేసి సినిమాపై ఆస‌క్తి పెంచింది. 

ప‌వన్ క‌ల్యాణ్‌ (Pawan Kalyan) కు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చిన "తొలిప్రేమ" చిత్రంలో ఆయనకు సోదరిగా నటించిన వాసుకి ఆనంద్, ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

'సీతారామం'లో దుల్క‌ర్ స‌ల్మాన్ ఆర్మీ అధికారి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) ఓ ముస్లిం యువ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 'సీతారామం' సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్, ర‌ష్మిక‌ల పాత్ర‌లే కీల‌కమ‌ని టాక్. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ను జూలై 25 న విడుద‌ల చేస్తామంటూ ఓ స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేశారు.  

జూలై 25న సీతారామం ట్రైల‌ర్

"సీతారామం" ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటూ తొలుత పలువురు మీడియా రిపోర్టర్లు రష్మికకు ఫోన్ చేసి అడుగుతారు. ఆమె వెంటనే మృణాల్ ఠాకూర్ కు, దర్శకుడు హను రాఘవపూడికి కాల్ చేసి, ట్రైలర్ విడుదల ఎప్పుడని అడుగుతుంది. ఆ తర్వాత వెంటనే హీరో దుల్కర్ సల్మాన్ కు కూడా ఫోన్ చేసి అప్డేట్ అడుగుతుంది. తాను ప్రస్తుతం ట్రైలర్ కోసం పలు భాషల్లో డబ్బింగ్ చెబుతూ బిజీగా ఉన్నానని.. "సీతారామం" సినిమా ట్రైలర్ జులై 25 న రిలీజ్ అవుతుందని చెబుతారు దుల్కర్. ఇలా సరికొత్త ఐడియాతో "సీతారామం" ట్రైలర్ విడుదల తేదీని రివీల్ చేశారు నిర్మాతలు.

Read More: 'సీతారామం'లో న‌టించేందుకు ఓ కండీష‌న్ పెట్టిన సుమంత్ (Sumanth).. విల‌న్ పాత్ర‌లు కూడా చేస్తాన‌న్న‌ హీరో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!