'సీతారామం'లో నటించేందుకు ఓ కండీషన్ పెట్టిన సుమంత్ (Sumanth).. విలన్ పాత్రలు కూడా చేస్తానన్న హీరో
టాలీవుడ్‌లో హీరో సుమంత్ (Sumanth) నటనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా 'గోదావరి' చిత్రంలో రామ్ పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం సుమంత్ దుల్కర్ సల్మాన్ చిత్రం 'సీతారామం'లో కీలక పాత్రలో నటిస్తున్నారు. కథ నచ్చితే విలన్ ప్రాతల్లో కూడా నటిస్తానని సుమంత్ చెబుతున్నారు. 'సీతారామం' చిత్రంలో దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
గెస్ట్ రోల్‌పై సుమంత్ (Sumanth) ఏమన్నారు?
ఒక నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉందని సుమంత్ అన్నారు. తన కెరీర్‌లో మొదటి సారి సపోర్ట్ రోల్ చేస్తున్నానని చెప్పారు. 'సీతారామం' చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా ఓ మంచి సపోర్టింగ్ రోల్ చేశానన్నారు. ఈ సినిమాలో సుమంత్‌తో పాటు రష్మికా మందనా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
నా పాత్ర ప్రత్యేకమైంది - సుమంత్
16 ఏళ్ల క్రితం 'గోదావరి' చిత్రంలో సీతారాముల కథను చెప్పామని సుమంత్ చెప్పారు. ప్రస్తుతం 'సీతారామం' కథలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో నటించమని దర్శకుడు హను రాఘవపూడి అడిగారట. 'సీతారామం'లో నటించాలంటే సుమంత్ ఓ కండీషన్ పెట్టారట.
తాత పోలిక ఉండటం నా అదృష్టం - సుమంత్
'సీతారామం' సినిమాలో నటించాలంటే స్కిప్ట్ మొత్తం చదివాకే ఓకే చెప్పానని అన్నారట సుమంత్ (Sumanth). హను రాఘవపూడి ఇచ్చిన స్కిప్క్ 150 పేజీలు చదివాక 'సీతారామం' సినిమాలో నటిస్తానని చెప్పారట. తాను నటించే పాత్ర సినిమాలో చాలా కీలకమైందని తెలిపారు. చాలా షేడ్స్ ఉంటాయన్నారు. తాను నెగటివ్ రోల్‌లో నటించలేదని క్లారిటీ ఇచ్చారు. హీరోగా తాను రెండు సినిమాల్లో నటిస్తున్నాని సుమంత్ చెప్పారు. అంతేకాకుండా వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారట.
తాతగారు అక్కినేని నాగేశ్వరరావు పోలికలు తనకు ఉండటం అదృష్టమన్నారు సుమంత్. తన తల్లికి తాతగారి పోలికలు ఉన్నాయని.. తానకు తన పోలిక వచ్చిందన్నారు. సీతారామం కచ్చితంగా విజయం సాధిస్తుందని సుమంత్ అంటున్నారు.
Read More: Sumanth & Dulqar Salman: దుల్కర్ సల్మాన్ పై సుమంత్ ప్రశంసల వర్షం