'సీతారామం'లో రష్మికా మందన్న (Rashmika Mandanna) ఫ‌స్ట్ లుక్ రిలీజ్!.. బ‌క్రీద్ సంద‌ర్భంగా స్పెష‌ల్ పోస్ట‌ర్

Updated on Jul 10, 2022 08:00 PM IST
Sita Ramam: 'సీతారామం'లో క‌శ్మీరీ యువ‌తి అఫ్రీన్ పాత్ర‌లో రష్మికా మందన్న (Rashmika Mandanna) న‌టిస్తున్నారు
Sita Ramam: 'సీతారామం'లో క‌శ్మీరీ యువ‌తి అఫ్రీన్ పాత్ర‌లో రష్మికా మందన్న (Rashmika Mandanna) న‌టిస్తున్నారు

'సీతారామం' సినిమా నుంచి హీరోయిన్ రష్మికా మందన్న (Rashmika Mandanna) ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. బ‌క్రీద్ సంద‌ర్భంగా  సీతారామం చిత్ర యూనిట్ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్, మృణాళినీ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌కుతుంది. 

స్పెష‌ల్ పాత్ర‌లో ర‌ష్మిక (Rashmika Mandanna)
క‌న్న‌డ బ్యూటీ రష్మికా మందన్న (Rashmika Mandanna) టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నారు. సీతారామం చిత్రంలో ఓ స్పెష‌ల్ రోల్‌లో క‌నిపించి ప్రేక్ష‌కుల‌ను క‌నువిందు చేయ‌నున్నారు. ఓ ముస్లిం యువ‌తి పాత్ర‌లో కొత్త క్యారెక్ట‌ర్‌లో సీతారామంలో న‌టిస్తున్నారు. క‌శ్మీరీ యువ‌తి అఫ్రీన్ పాత్ర‌లో ర‌ష్మిక న‌టిస్తున్నారు. ముస్లిం యువ‌తి గెట‌ప్‌లో ఉన్న ర‌ష్మిక‌ బ‌క్రీద్ విషెస్ చెబుతున్న‌ట్టుగా ఉన్న పోస్ట‌ర్ రిలీజ్ అయింది. ఈ పోస్ట‌ర్‌ అందరినీ ఆక‌ట్టుకుంటోంది. 

Sita Ramam: 'సీతారామం'లో క‌శ్మీరీ యువ‌తి అఫ్రీన్ పాత్ర‌లో రష్మికా మందన్న (Rashmika Mandanna) న‌టిస్తున్నారు

డియ‌ర్ కామ్రేడ్ చిత్రంలో కూడా ముస్లిం యువ‌తిగా ర‌ష్మిక న‌టించారు. పుష్ప త‌ర్వాత ర‌ష్మిక పాన్ ఇండియా హీరోయిన్‌గా మారారు. అయితే ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. టాలీవుడ్ హీరో సుమంత్ కూడా ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో బ్రిగేడియర్‌ విష్ణు శర్మ పాత్రలో క‌నిపించ‌నున్నారు. అన్ని షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించి మెప్పించ‌నున్నారు. 

దుల్క‌ర్ సల్మాన్‌ రామ్ అనే జ‌వాన్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై స్వ‌ప్న ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఆగ‌స్టు 5న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం స‌మ‌కూర్చారు. ఈ చిత్రానికి పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. 

Read More: 'సీతారామం'లో న‌టించేందుకు ఓ కండీష‌న్ పెట్టిన సుమంత్ (Sumanth).. విల‌న్ పాత్ర‌లు కూడా చేస్తాన‌న్న‌ హీరో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!