Dulquer Salman: ఆహ్లాదకరంగా 'సీతరామం' టీజర్.. ఆసక్తికర విషయాలు పంచుకున్న దుల్కర్ సల్మాన్!

Published on Jun 27, 2022 08:29 PM IST

Sita Ramam Movie: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యుద్ధ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

ఈ కార్యక్రమంలో లో హీరో (Dulquer Salman) దుల్కర్ సల్మాన్, దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత స్వప్న దత్, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు హాజరైన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ అనతికాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. దుల్కర్ తనదైన స్టైల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులను దోచుకున్నారు. 

1965 బ్యాక్ డ్రాప్ తో రోహిణి వాయిస్‌ ఓవర్‌ తో టీజర్ ప్రారంభమౌతుంది. సైనికుడు రామ్ గురించి చెబుతుంది. కుటుంబం ఉండదు. తన సహోద్యోగులతో సమయాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఒక నిమిషం 14 సెకన్ల నిడివిగల ‘సీతా రామం’ (Sita Ramam Teaser) టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 'లెఫ్టినెంట్‌ రామ్‌. నిన్ననే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్‌ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు.తనకు మాట్లాడటానికి ఒక కుటుంబం. కనీసం ఉత్తరం రాయడానికి పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది' ఈ వాయిస్ ని ఫాలో అవుతూ చూపించిన విజువల్స్, ఎమోషన్స్ మ్యాజికల్ గా ఉన్నాయి.

ఇక, టీజర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ...‘సీతా రామం’ టీజర్ కి వండర్ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకంటే వండర్ ఫుల్ గా సినిమా ఉండబోతోంది.‘సీతా రామం’ మెమరబుల్ మూవీ. అత్యద్భుతమైన లోకేషన్స్ లో షూట్ చేశాం. ఈ సినిమా ద్వారా దేశంలో చాలా ప్రదేశాలు చూసే అవకాశం దక్కింది, దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi), స్వప్న గారి సపోర్ట్ కి కృతజ్ఞతలు. విశాల్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. 'సీతా రామం' కథ గొప్పగా ఉంటుంది. సినిమా విజువల్ వండర్ గా ఉండబోతోంది” అని అన్నారు.

Read More: Sita Ramam Teaser: 'యుద్ధం రాసిన ఈ ప్రేమకథలో ఇద్దరు ప్రేమికులు'.. 'సీతారామం' టీజర్!