Shakuntalam: 'శాకుంత‌లం'లో రాణిగా క‌నిపించనున్న స‌మంత‌ (Samantha).. న‌వంబ‌ర్‌లో రిలీజ్ చేస్తున్న గుణ‌శేఖ‌ర్

Updated on Sep 23, 2022 11:25 AM IST
 Shakuntalam: 'శాకుంత‌లం'లోస‌మంత శ‌కుంత‌ల పాత్ర‌లో.. మలయాళ నటుడు దేవ్ మోహన్  దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు,
Shakuntalam: 'శాకుంత‌లం'లోస‌మంత శ‌కుంత‌ల పాత్ర‌లో.. మలయాళ నటుడు దేవ్ మోహన్  దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు,

Shakuntalam: టాలీవుడ్ హీరోయిన్ స‌మంత (Samantha) న‌టిస్తున్న అత్యంత ప్ర‌తీష్టాత్మ‌క చిత్రం 'శాకుంత‌లం'. 'రుద్ర‌మ‌దేవి' సినిమాతో మ‌రింత పాపుల‌ర్ అయిన ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స‌మంత శ‌కుంత‌ల పాత్ర‌లో.. మలయాళ నటుడు దేవ్ మోహన్  దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు, ఈ ప్రేమ కథను ఆసక్తికరంగా గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో రూపొందించారు. 

న‌వంబ‌ర్‌లో రిలీజ్

గ‌త కొన్ని రోజులుగా 'శాకుంతలం' సినిమా రిలీజ్‌పై ఎన్నో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. డిసెంబ‌ర్‌లో ఈ సినిమా రిలీజ్ చేస్తార‌నే టాక్ వినిపించింది. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ త‌న సినిమా 'శాకుంత‌లం' రిలీజ్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. ఓ వీడియోను రిలీజ్ చేసి మ‌రీ 'శాకుంత‌లం' సినిమా అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. ఈ వీడియోలో స‌మంత మ‌రింత అందంగా క‌నిపించారు. దేవ్ మోహ‌న్‌, స‌మంత ఫోటోను కూడా విడుద‌ల చేశారు.  'శాకుంత‌లం' సినిమాను న‌వంబ‌ర్ 4 తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

అద్భుత‌మైన ప్రేమ‌కావ్యం
మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా 'శాకుంత‌లం' (Shakuntalam) సినిమాను గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంతుల ప్రేమకథను వెండితెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు గుణ‌శేఖ‌ర్. ప్రస్తుతం శాకుంత‌లం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయట‌. ఈ సినిమాలో భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ న‌టిస్తున్నారు. దుర్వాస మునిగా మోహ‌న్ బాబు న‌టిస్తున్నారు.అనసూయ పాత్రలో అదితి బాలన్ నటిస్తున్నారు. రాక్షసుడి పాత్రలో కబీర్ దుల్హన్ సింగ్.. ఇక‌ మేనక పాత్రలో మధు నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. గుణ‌టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు.ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ఫ‌ణ‌లో 'శాకుంత‌లం' చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

Read More: Shakuntalam: 'శాకుంత‌లం' ప్రేమ‌క‌థ రెడీ అంటున్న‌ గుణ‌శేఖ‌ర్.. స‌మంత‌ (Samantha)కు అల్లు అర్హ ఏమ‌వుతుంది?.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!