Tollywood: టాలీవుడ్ సెలబ్రిటీల ఖరీదైన ఇళ్ళు ఇవే.. వాటి ధర చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే !

Updated on Jun 14, 2022 09:21 PM IST
 టాలీవుడ్ సెలబ్రిటీల ఖరీదైన ఇళ్లు (South celebrities lavish homes)
టాలీవుడ్ సెలబ్రిటీల ఖరీదైన ఇళ్లు (South celebrities lavish homes)

Tollywood Celebrities: టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లలో ఎవరి రేంజ్ వారికి ఉంది. వారి రేంజ్‌ను బట్టే వారి పారితోషికం కూడా ఉంటుంది. ఇక వారి సంపాదన బట్టే వారి ఖర్చు కూడా ఉంటుంది. హీరోలు ప్రతి ఒక్కటి ఖరీదైనవే వాడుతూ ఉంటారు.

వాళ్ళు వాడే బట్టలు, వాచ్‌లు, కార్లే చాలా ఖరీదని అనుకుంటాము. ఇవే ఇంత ఖరీదైనప్పుడు స్టార్ హీరోలు నివసించే ఇల్లు ఎంత రిచ్ గా ఉంటుందో ఆలోచించండి. ఇక వీరందరూ ఉంటున్న ఇళ్ల ధరలు తెలిస్తే ఎవరైనా షాక్ అవాక్కవ్వాల్సిందే.

హైదరాబాద్‌లోని ఖరీదైన ప్లేసుల్లో.. అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఇళ్లల్లో మన స్టార్ హీరోలు నివసిస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు ఇళ్లలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

ఆ ఇళ్లను చూస్తే మనకి కళ్ళు తిరగడం గ్యారెంటీ. అలాంటిది వాటి ధర తెలిస్తే షాక్ అవుతాం. సోషల్ మీడియాలో చెప్పిన కొన్ని నివేదికల ఆధారంగా వివిధ స్టార్ హీరోల ఇళ్ల ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం. 

స్టార్ హీరోలు .. స్టార్ విల్లాలు

అల్లు అర్జున్ (Allu Arjun): స్టైలిష్ స్టార్.. యూత్ ఐకాన్ అనే పేర్లలతో అల్లు అర్జున్ ప్రస్తుతం టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. అందరి హీరోల తీరు ఒకటి.. మన బన్నీ తీరు మాత్రం ఒకటి. తాజాగా ‘అల వైకుంఠపురంలో’ సినిమా సక్సెస్ మీట్‌లో అల్లుఅరవింద్.. అల్లు అర్జున్ ఇంటి గురించి మాట్లాడుతూ నీ ఇంట్లో స్విమ్మింగ్ ఫూల్ కట్టడానికి నాకు తడిసి మోపిడయిందని అన్నారు.

దాని బట్టి మీరే అర్ధం చేసుకోండి.. మొత్తం ఇంటి ధర ఏ రేంజ్‌లో ఉంటుందో. అల్లు అర్జున్ దాదాపు రూ.100 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నాడు. టాలీవుడ్ హీరోల్లో అందరి కంటే అత్యంత విలాసవంతమైన బంగ్లాలో ఆయన నివసిస్తున్నాడు. 

 

Prabhas: ఇక ఆ తర్వాత ప్రభాస్ (Prabhas) 60 కోట్ల విలువైన బంగ్లాలో నివసిస్తున్నాడు. ఈ బంగ్లా హైదరాబాద్‌లో ఉంది. 

ప్రభాస్ ఇల్లు (Prabhas House)

కింగ్ నాగార్జున కూడా.. 

Akkineni Nagarjuna: ఆ తర్వాత లిస్టులో కింగ్ నాగార్జు సైతం ఉన్నాడు. నాగార్జున సినిమాల్లోనే కాకుండా, బిజినెస్‌లలో కూడా బాగా సంపాదించారు. అక్కినేని నాగార్జున తన భార్య అమల, కుమారుడు అఖిల్‌తో కలిసి 40 కోట్ల రూపాయల విలువైన లావిష్ హోమ్‌లో నివసిస్తున్నారు. నాగ చైతన్య విడిగా మరో ఇంట్లో ఉంటున్నాడు.

నాగార్జున ఇల్లు (Nagarjuna House)

Megastar Chiranjeevi: ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు తమ కుటుంబ సభ్యులతో రూ.40 కోట్ల రూపాయల విలువైన ఇంట్లో ఉంటున్నాడు. 

Mahesh Babu: ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూ.28 కోట్ల రూపాయల విలువైన ఇంట్లో భార్య నమ్రతా శిరోధ్కర్, పిల్లలతో నివసిస్తున్నాడు. ఇదే రేంజ్‌లో మరో ఇల్లు కూడా మహేష్‌కి ఉంది. 

Vijay Devarakonda: ఇక ‘అర్జున్ రెడ్డి’తో స్టార్ హీరోగా మారిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా రూ.15 కోట్ల రూపాయల విలువైన బంగ్లాలో నివస్తున్నాడు. ఈయన 2019 లో తన కొత్త ఇల్లును కట్టుకున్నాడు.

Samantha: ఇక సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న స‌మంత లైఫ్ సైతం ఎంత ల‌గ్జ‌రీగా ఉంటుందో కొద్ది మందికి మాత్ర‌మే తెలుసు. స‌మంత హీరోయిన్‌గా వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న‌ప్పుడే అటు బెంగ‌ళూరు, చెన్నైతో పాటు హైద‌రాబాద్‌, వైజాగ్‌లో భారీగా ఆస్తులు సంపాదించుకున్నారు. చెన్నై, హైద‌రాబాద్‌లో ఆమె విల్లాలు, ప్లాట్లు ఉన్నాయి.

ముంబైలో సైతం ఆమె ఓ ప్లాట్ కొనుగోలు చేసింది. వైజాగ్‌లోనూ రియ‌ల్ ఎస్టేట్ల‌లో ఆమె కొన్ని పెట్టుబ‌డులు అయితే పెట్టింది. ఇక స‌మంత ల‌గ్జ‌రీ కార్లు బాగా ఇష్ట‌ప‌డుతుంది. ఆమె ద‌గ్గ‌ర ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఆరు ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయ‌ట‌. 

సమంత కార్లు (Samantha Cars)

Jr. Ntr: ఇక జూనియర్ ఎన్టీఆర్ నివసిస్తున్న ఇల్లు సైతం, ఎన్నో కోట్ల  రూపాయలు కచ్చితంగా పలుకుతుంది,

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!