Avika Gor: అందం, అభినయంతో అదరగొడుతున్న 'చిన్నారి పెళ్లి కూతురు' అవికాగోర్..!

Updated on Jun 14, 2022 08:12 PM IST
అవికా గోర్ (Avika Gor)
అవికా గోర్ (Avika Gor)

Avika Gor: యంగ్ హీరోయిన్ అవికా గోర్ గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు.  మా టీవీలో ప్రసారమైన ‘చిన్నారి పెళ్ళి కూతురు’ అనే హిందీ డబ్బింగ్ సీరియల్‌‌లో నటించి..  తెలుగునాట కూడా మంచి క్రేజ్‌‌ను సంపాదించుకుంది ఈ బొంబాయి భామ. ముంబయిలో పుట్టి పెరిగిన అవికా గోర్, తన కెరీర్‌ను తొలుత హిందీ టీవీ సీరియళ్లతోనే ప్రారంభించింది. 

ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ రాజ్ తరుణ్ హీరోగా చేసిన తొలి సినిమా ‘ఉయ్యాలా జంపాలా’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో వెంటనే ఈమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. 

అవికా గోర్ (Avika Gor)

హిందీలో బిజీగా మారిన అవికా గోర్

రాజ్ తరుణ్‌తో 'సినిమా చూపిస్తా మావ', నాగ శౌర్య తో (Naga Shaurya) 'లక్ష్మీ రావే మా ఇంటికి',  నిఖిల్‌తో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది అవికా గోర్. ఈ సినిమాల ద్వారా ఆమె మంచి ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకుంది. కానీ, ఆ తర్వాత అనుకోకుండా  కొన్నాళ్లు ఈమె ఇండస్ట్రీకి దూరమైంది

వరుసగా హిట్లు వచ్చి ఉంటే.. ఈమె మంచి స్టార్ హీరోయిన్ అయ్యేదని అంటూ ఉంటారు విశ్లేషకులు. కానీ.. “ఎక్కడికి పోతావు చిన్నవాడా”తో సూపర్ హిట్ సొంతం చేసుకొన్న ఆవికా.. ఆ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో మాత్రం కనిపించలేదు.

ఇక్కడ సినిమాలు మానేసి.. హిందీలో సీరియల్స్, వీడియో సాంగ్స్‌లో నటించడం మొదలుపెట్టింది. దీంతో ఈమె టాలీవుడ్‌‌కి దాదాపు దూరమైనట్లే అని అందరూ అనుకున్నారు. 

అవికా గోర్ (Avika Gor)

తమన్నా స్థానంలో.. అవికా గోర్

కట్ చేస్తే.. "రాజుగారి గది 3"తో రీఎంట్రీ ఇచ్చింది ఈ నేచురల్ బ్యూటీ. ఈ చిత్రం కూడా కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది.  ఆఖరి నిమిషంలో మిల్కీ బ్యూటీ తమన్నా తప్పుకోవడంతో, ఈ సినిమాలో ఆమె స్థానంలోకి అవికా గోర్ వచ్చి చేరింది. 

"చిన్నారి పెళ్లికూతురు” (Chinnari Pelli Kuthuru) సీరియల్ అయిపోయి దాదాపు ఆరేళ్లు అయినా.. అవికను కొందరు జనాలు ఇంకా చిన్నపిల్లలానే చూస్తూ ఉండడం గమనార్హం. ఏదేమైనప్పటికీ, ఈ మధ్యకాలంలో అవిక సరికొత్త ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అవార్డ్ ఫంక్షన్స్‌కి కూడా హాట్ డ్రెస్సులతో అటెండ్ అవుతూ కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. 

ఇక ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ నిర్మాతగా కూడా మారింది. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ… 'ఇది నా మొదటి ప్రొడక్షన్ కనుక అద్భుతమైన అనుభవం. మేం గోవాలో 10 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్నాం. మొత్తం లొకేషన్‌లో వైబ్ చాలా విభిన్నంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చింది.

ఇక అవికా ప్రస్తుతం నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'థ్యాంక్యూ' సినిమాలో నటిస్తోంది. అలాగే చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ (Kalyan Dev) సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.

అంతేకాకుండా, ఖజకిస్తాన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న విదేశీ సినిమా 'ఐ గో టూ స్కూల్'లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. అలాగే 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ అనే హిందీ చిత్రంలో బాలీవుడ్ పరిశ్రమలోకి కథానాయికగా కూడా ఎంటర్ అవనుంది. 

Read More: The Warrior: 20 మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించిన.. రామ్ పోతినేని సినిమా 'ది వారియర్' టీజర్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!