మహారాష్ట్ర సీఎంను కలిసిన మేజర్ (Major) చిత్ర యూనిట్ .. ఫండ్ రైజింగ్ కోసం మాట తీసుకున్న టీం !
26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ (Major) సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మేజర్’. అడివి శేష్ మేజర్ ఉన్నికృష్ణన్‌గా నటించి మెప్పించాడు. ఈ సినిమా జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ప్రేక్షకుల గుండెలకు హత్తుకునేలా తెరకెక్కించాడు దర్శకుడు శశికిరణ్ తిక్కా.
సోనీ పిక్చర్స్‌తో కలిసి సూపర్‌స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా చూసిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరో అడివి శేష్‌ను, నిర్మాత మహేష్‌బాబును ప్రత్యేకంగా అభినందించాడు. కాగా, ఆర్మీలో చేరాలనుకునే వారికి మేజర్ టీం సహాయం చేస్తుందని అడివి శేష్ ప్రకటించాడు.
ఈ క్రమంలోనే ఆర్మీలో చేరాలనుకునే వారికి సహాయపడేందుకు ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించాడు శేష్. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను మర్యాద పూర్వకంగా కలిసింది మేజర్ టీమ్. ఈ సందర్భంగా ఫండ్ రైజింగ్‌కు సహకరించేలా సీఎం నుంచి మాట తీసుకున్నారు అడివి శేష్, దర్శకుడు శశి.
యూఎస్‌లోనూ మిలియన్ డాలర్ల కలెక్షన్స్..
యూఎస్‌లో అడివి శేష్ మేజర్ (Major) సినిమా దాదాపుగా ఒక మిలియన్ యూఎస్ డాలర్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో రాబట్టిన వసూళ్లు చూసి ఆశ్యర్యపోతున్నారు సినీ ప్రముఖులు, విశ్లేషకులు.
తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజు.. రూ. 0.76 కోట్ల షేర్ (రూ. 1.20 కోట్ల గ్రాస్) రాబట్టింది మేజర్. ప్రపంచవ్యాప్తంగా మిగతా భాషల్లో కలిపి రూ. 1.41 కోట్ల షేర్ (రూ. 2.5 కోట్ల గ్రాస్) వసూళ్లతో దూసుకుపోతోంది.
మేజర్ 6వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
నైజాం: రూ. 7.83 కోట్లు
సీడెడ్: రూ. 1.81 కోట్లు
ఈస్ట్: రూ. 1.19 కోట్లు
వెస్ట్ :రూ. 88 లక్షలు
గుంటూరు: రూ. 1.10 కోట్లు
కృష్ణ: రూ. 1.01 కోట్లు
నెల్లూరు: 65 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రూ. 16.67 కోట్లు (27.75 కోట్లు గ్రాస్)
హిందీ– రూ. 4.70 కోట్లు
వరల్డ్ వైడ్‌గా మొత్తం:- 29.17 కోట్లు (52.80 కోట్లు గ్రాస్ )
Read More: మేజర్ (Major) టీమ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్