స‌లార్(Salaar) సినిమా అప్‌డేట్‌తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Updated on May 14, 2022 04:53 PM IST
పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ సినిమా స‌లార్(Salaar)  నుంచి అప్‌డేట్ వ‌చ్చింది. స‌లార్ సినిమాను ఐదు నెల‌ల్లో రిలీజ్ చేస్తామ‌ని ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిర‌గందూర్ తెలిపారు.
పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ సినిమా స‌లార్(Salaar)  నుంచి అప్‌డేట్ వ‌చ్చింది. స‌లార్ సినిమాను ఐదు నెల‌ల్లో రిలీజ్ చేస్తామ‌ని ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిర‌గందూర్ తెలిపారు.

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ సినిమా స‌లార్(Salaar)  నుంచి అప్‌డేట్ వ‌చ్చింది. స‌లార్ సినిమాను ఐదు నెల‌ల్లో రిలీజ్ చేస్తామ‌ని ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిర‌గందూర్ తెలిపారు. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ స‌లార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నార‌ని చెప్పారు .

ప్ర‌భాస్ హీరోగా చాలా బిజీ అయ్యారు. రాధేశ్యామ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిసాస్ట‌ర్‌గా మిగిలింది. దీంతో డీలా ప‌డిన ఫ్యాన్స్‌కు ప్ర‌భాస్ కొత్త సినిమాల‌తో ఖుషీ చేయ‌నున్నారు. వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో థియేట‌ర్ల‌ను షేక్ చేయ‌నున్నారు. 

ఆది పురుష్‌, స‌లార్‌(Salaar) , ప్రాజెక్ట్ కె, స్పిరిట్  సినిమాలు ప్ర‌భాస్ చేస్తున్నారు. ఈ సినిమాల్లో దేనిక‌దే ప్ర‌త్యేకమే. కానీ స‌లార్ మాత్రం భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేస్తుంది. ద‌ర్శ‌క దిగ్గ‌జం ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్‌తో ఇండియ‌న్ సినిమా రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టారు. ప్ర‌భాస్ బాహుబ‌లితో భార‌తీయ సినిమాలో ప్ర‌త్యేక స్థానం సంపాదించారు. ఇక ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబో స‌లార్‌పై ఊహ‌కంద‌ని హిట్ సాధిస్తుంద‌ని డార్లింగ్ అభిమానులు అంటున్నారు. 

స‌లార్(Salaar)  సినిమాను హోంబ‌ళే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిర‌గందూర్ స‌లార్ రిలీజ్ అప్‌డేట్ ఇచ్చారు. ప్ర‌శాంత్ నీల్ స‌లార్ మూవీతో బిజీగా ఉన్నార‌న్నారు. 30 శాతం స‌లార్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంద‌న్నారు. 2022 అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్‌లో స‌లార్ సినిమా రిలీజ్ చేస్తామ‌ని విజ‌య్ కిర‌గందూర్ తెలిపారు. ఇక ప్ర‌భాస్ ఫ్యాన్స్ స‌లార్ అప్‌డేట్ రావ‌డంతో పండుగ చేసుకుంటున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!