హీరో ఎవరనేది కాదు.. కథ ఎలా ఉందనేదే నాకు ముఖ్యం: సాయి పల్లవి (Sai Pallavi)

Updated on Oct 17, 2022 10:57 AM IST
కథ నచ్చితే ఏ హీరోతో నటించడానికైనా తనకు అభ్యంతరం లేదని నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) స్పష్టం చేశారు
కథ నచ్చితే ఏ హీరోతో నటించడానికైనా తనకు అభ్యంతరం లేదని నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) స్పష్టం చేశారు

కథ నచ్చితేనే సినిమా చేస్తానంటున్నారు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. హీరో ఎవరనే దాని కంటే స్టోరీ ఎలా ఉందనే విషయానికే తాను అధిక ప్రాధాన్యత ఇస్తానని ఆమె చెబుతున్నారు. తాజాగా ఓ ఆమె ఓ ఇంటర్వూలో పాల్గొన్నారు. ఈ ముఖాముఖిలో మూవీలతో పాటు తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను సాయి పల్లవి వెల్లడించారు. 

బన్నీ డ్యాన్స్ ఇష్టం

సినిమాల ఎంపిక గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.. ఫలానా కథానాయకుడితో నటించాలనే కోరిక తనకు లేదన్నారు. ‘కథ నచ్చితే ఎవరితోనైనా యాక్ట్ చేస్తా. ఒక స్టార్ హీరో సినిమాలో నాకు ఆఫర్ వచ్చిందనే చెబితే.. ఆ కథానాయకుడు ఎవరని కూడా అడగను. తొలుత ఆ చిత్రం కథ చెప్పమంటా. ఇండస్ట్రీలో ఉన్న హీరోలపై నాకు చాలా గౌరవం ఉంది. అల్లు అర్జున్ డ్యాన్స్‌ను బాగా ఇష్టపడతా. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ నాకు నచ్చుతుంది. మహేష్‌ను చూశాక.. మగాళ్లు ఇంత అందంగా ఉంటారా!’ అని అనిపించిందని సాయి పల్లవి వ్యాఖ్యానించారు. 

సోషల్ మీడియా అంటే పడదు

‘నేను ప్యూర్ వెజిటేరియన్‌ను. అన్నం, పప్పు ఉంటే చాలు. ఇంకేమీ అడగను. షూటింగ్‌లో ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు, మజ్జిగతో సరిపెట్టుకుంటా. నేను అసలు ఫిట్‌నెస్ చేయను. అప్పుడప్పుడు మా అమ్మతో బ్యాడ్మింటన్ ఆడుతుంటా. నేను అంత ఈజీగా బరువు పెరగను‘ అని సాయి పల్లవి అన్నారు. అలాగే తనకు సోషల్ మీడియా అంటే పడదన్నారు. అదో టైమ్ వేస్ట్ వ్యవహారమని ఆమె పేర్కొన్నారు. 

నటన నేర్చుకోకపోవడం కలిసొచ్చింది

నటన, డ్యాన్స్‌ను తాను నేర్చుకోలేదని సాయి పల్లవి అన్నారు. బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ డ్యాన్స్ వీడియోలు చూస్తూ స్టెప్స్ ప్రాక్టీస్ చేసేదాన్నని తెలిపారు. డ్యాన్స్, నటన నేర్చుకోకపోవడం తనకు కలిసొచ్చిందన్నారు. ‘సాయి పల్లవి బాగా నటించిందని ఎవరైనా అంటే.. నువ్వెక్కడ నటించావే, ఇంట్లో ఉన్నట్లే ఉన్నావని మా అమ్మ అంటుంది’ అని ఈ నేచురల్ బ్యూటీ తన సక్సెస్ సీక్రెట్ సీక్రెట్ బయటపెట్టారు. తన కెరీర్ లో ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ చిత్రాలు చాలా ప్రత్యేకమని సాయి పల్లవి అన్నారు. ముఖ్యంగా ‘ఫిదా’తో తన సినీ ప్రయాణం మారిపోయిందని.. తన ఆలోచనా విధానాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ములు మార్చేశారన్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎక్కడైనా సరే, నీ హక్కుల కోసం నువ్వు పోరాడుతూనే ఉండాలి’ అని శేఖర్ కమ్ముల అంటుంటారని సాయి పల్లవి వివరించారు.   

Read more: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న ‘పుష్ప2’ (Pushpa2)లో సాయిపల్లవి?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!