ముదురుతున్న ‘వారసుడు’ (Varasudu) సినిమా వివాదం.. డబ్బింగ్ చిత్రాలను ఆపడం కష్టమన్న అల్లు అరవింద్ (Allu Aravind)

Updated on Nov 19, 2022 03:25 PM IST
మంచి సినిమాలు ఏ భాష నుంచి వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) అన్నారు
మంచి సినిమాలు ఏ భాష నుంచి వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) అన్నారు

ఒకే ఒక్క సినిమా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ మధ్య చిచ్చు రేపుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారసుడు’ (Varasudu) సినిమా రెండు పరిశ్రమల మధ్య వివాదానికి కారణమవుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. తమిళంలో ‘వరిసు’గా, తెలుగులో ‘వారసుడు’గా వస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సంక్రాంతికి తెలుగు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని.. డబ్బింగ్ చిత్రాలను విడుదల చేయొద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖను విడుదల చేసింది. 

తెలుగు నిర్మాతల మండలి రిలీజ్ చేసిన లేఖపై తమిళ సినీ దర్శక నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాట తెలుగు చిత్రాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విడుదలవుతున్నాయిని.. అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తమిళ సినిమాలను ఆపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే తాము కూడా తెలుగు మూవీస్‌ను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. 

డబ్బింగ్ చిత్రాలను విడుదల చేయొద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖను విడుదల చేసింది

తమిళ దర్శకుడు సీమాన్ మాట్లాడుతూ.. ‘వారసుడు’ సినిమా దర్శకుడు, నిర్మాత ఇద్దరూ తెలుగువారేనని అన్నారు. హీరో మాత్రమే తమిళుడన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఎందుకు స్పందించడం లేదని క్వశ్చన్ చేశారు. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్పందించారు. డబ్బింగ్ చిత్రాలను ఆపడం సాధ్యం కాదని ఆయన అన్నారు. 

‘బాహుబలి సినిమా నుంచి చిత్ర పరిశ్రమలో సౌత్, నార్త్ అనే ఎల్లలు చెదిరిపోయాయి. నార్త్‌లో బాగున్న సినిమా ఇక్కడ ఆడుతుంది. సౌత్‌లో తీసిన సినిమా బాగుంటే నార్త్‌లో ఆడుతుంది. మంచి సినిమా ఎక్కడున్నా దాన్ని తెలుగు ప్రేక్షకులు ప్రేమిస్తారు, చూస్తారు. ఇది మన సంస్కృతిగా మారింది’ అని ‘తోడేలు’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో అరవింద్ వ్యాఖ్యానించారు. హిందీ చిత్రం ‘భేడియా’ (Bhediya)ను ఆయన తెలుగులో ‘తోడేలు’ (Thodelu) పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్, కృతీ సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

Read more: Project K: ఇలాంటి సినిమాను ఇంతవరకు ఎవ్వరూ చూసుండరు.. ‘ప్రాజెక్ట్ కే’పై నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!