Biggboss Season 6: బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ మీట్ ఎపిసోడ్స్.. ఎమోషనల్ గా హౌస్ మేట్స్.. ప్రోమో వైరల్

Updated on Nov 24, 2022 10:37 AM IST
ఇదిలా ఉంటే.. ఈ వారం రేవంత్ (Singer Revanth), కీర్తి (Keerthy) తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఈ వారం రేవంత్ (Singer Revanth), కీర్తి (Keerthy) తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు.

Biggboss Season 6: బిగ్ బాస్ సీజన్ 6లో గత రెండు రోజులుగా ఫ్యామిలీ మీట్ ఎపిసోడ్స్ ప్రసారమవుతున్నాయి. దీంతో షో చాలా ఎమోష‌న‌ల్‌గా సాగుతోంది. ప్రతి సీజన్ లో పదో వారంలోనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేవారు. ఈ సారి మాత్రం 12వ వారంలో కుటుంబ సభ్యులను అనుమతించారు బిగ్ బాస్. గత ఎపిసోడ్ లో ఆదిరెడ్డి భార్య, కూతురు.. రాజ్ వాళ్ల అమ్మ రాగా.. బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో ఫైమా మదర్, శ్రీసత్య తల్లిదండ్రులు, రోహిత్ తల్లి వచ్చారు.

తాజాగా విడుదలైన ప్రోమోలో (Biggboss Promo).. రాజ్ ఇంట్లో పాటల టీచర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అందరికీ పాటలే నేర్పిస్తూ కనిపించాడు. ఫైమాకు, శ్రీహాన్‌కు పాటలు నేర్పించాడు. ఇందులో శ్రీహాన్‌కు ‘లాలి లాలి’ పాట నేర్పించబోయాడు. ఇందులో మళ్లీ ఆయన ‘వసపత్ర సాయికి’ అంటూ అందుకున్నాడు. రాజ్‌ ఎప్పుడు తెలుసుకుంటాడో వటపత్రసాయికి అని రేవంత్ అనడంతో.. ‘నువ్వే నాకు చెప్తావా’ అంటూ వాదన పెట్టుకున్నాడు. అయితే అదంతా ఫన్ కోసమే చేశారు. ఈ లోపు ఇంట్లోవారిని ఫ్రీజ్ చేశారు బిగ్ బాస్.

బుధవారం ఎపిసోడ్‌ తొలుత ఫైమా (Faima) తల్లిని పంపించారు. చాలా జోవియల్‌గా ఉండే తన తల్లిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఫైమా. ఫైమా తల్లి షాహీదా హౌస్ లోకి రాగానే.. ఫైమా గట్టిగా హత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది. ఆమె అందరితోనూ ఫ్రీగా మాట్లాడారు. తాము ఒకప్పుడు ఎన్నో కష్టాలుపడ్డామని, కానీ ఇప్పుడు నా కూతురు సంపాదిస్తుంటే తాము తింటున్నామని గ‌ర్వంగా చెప్పింది. ఇక త‌ల్లి ఫైమాకి కొన్ని స‌ల‌హాలు, సూచ‌నుల చేసింది. ఎటకారాలు తగ్గించుకుంటూ కాస్త జెన్యూన్‌గా ఆడాలని తెలిపింది. ఇక పోయే ముందు అందరితో కలిసి డాన్సు చేసింది ఫైమా తల్లి.

అనంతరం బిగ్ బాస్ హౌస్‌లోకి శ్రీసత్య (Sree Satya) పేరెంట్ ప్రసాద్, శ్రీలతలు వచ్చారు. కదల్లేని స్థితిలో మంచానికే పరిమితం అయిన శ్రీసత్య తల్లి.. తన భర్త సాయంతో కూతురు గెలుపు కోసం బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చింది. వాళ్లిద్దరినీ చూసిన శ్రీసత్య కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసింది. తల్లికి గోరుముద్దలు తినిపించింది. శ్రీసత్య తండ్రి నువ్వు బాగానే ఆడుతున్నావు కానీ.. వెటకారం తగ్గించుకో, సిల్లీ కారణాలతో నామినేషన్స్ వేయకు అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయాక తన తల్లికి చికిత్స చేయించడానికి డబ్బులు లేవు అని బాధపడింది. 

ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్ నుంచి రోహిత్ తల్లి వచ్చింది. రాగానే కొడుకుని ప్రేమగా ముద్దుపెట్టుకున్నారు. ఇంటి సభ్యులతో ప్రేమగా మాట్లాడారు. అందరికీ తినిపించారు. ఆదిరెడ్డి డ్యాన్సు అదిరిపోయిందని చెప్పింది. ఆమెకు తెలుగు సరిగా రాక పోవడంతో హిందీలో మాట్లాడింది.

ఇదిలా ఉంటే.. ఈ వారం రేవంత్ (Singer Revanth), కీర్తి (Keerthy) తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు. ఈ వారం శ్రీహాన్ కు ఆరు ఓట్లు, ఫైమాకి మూడు ఓట్లు, రోహిత్‌కి మూడు ఓట్లు, రాజ్‌కి రెండు ఓట్లు, ఆదిరెడ్డికి రెండు ఓట్లు, ఇనాయకు రెండు ఓట్లు పడ్డాయి. కీర్తిని ఎవరూ నామినేట్ చేయలేదు. ఇక రేవంత్ కెప్టెన్ అవ్వడంతో ఎవరూ  నామినేట్ చేయలేకపోయారు. రాజ్ లేదా రోహిత్... వీరిద్దరిలో ఎవరో ఒకరు బయటికి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు భావిస్తున్నారు ప్రేక్షకులు. 

Read More: Biggboss Season 6: ఆట తీరుతో టాక్ ఆఫ్ ద బిగ్ బాస్ గా మారిన ఇనయా సుల్తానా (Inaya Sultana).. టాప్ 3 లో కన్ఫమ్?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!